Begin typing your search above and press return to search.

ఈడీ కేసుపై క్లారిటీ ఇచ్చిన నామా!

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:30 PM GMT
ఈడీ కేసుపై క్లారిటీ ఇచ్చిన నామా!
X
టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తాజాగా తనపై జరుగుతున్న ప్రచారం.. ఈడీ కేసులపై స్పందించారు. శనివారం ఈ కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జార్ఖండ్ లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని వచ్చిన ఆరోపణలను నామా ఖండించారు.

40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను స్థాపించి కష్టపడి పనిచేశానని ఈ స్థితికి తీసుకొచ్చానని నామా నాగేవ్వరరావు తెలిపారు. చైనా సరిహద్దుల్లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో మా సంస్థ వెళ్లి రోడ్లు వేసిందని తెలిపారు. తాను ఎవరిని మోసం చేయలేదని.. సంస్థను మా ఇద్దరు సోదరులు చూసుకుంటారని నామా తెలిపారు. కంపెనీలో నేను ఎండీగా లేనని.. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని .. 25న ఈడీ విచారణకు హాజరు అవుతానని నామా తెలిపారు.

తాను ఈడీ విచారణకు సహకరిస్తానని.. నీతి నిజాయితీగా ఉంటూ రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్నానని నామా తెలిపారు. నన్ను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారని.. నా బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు అంటూ నామా పేర్కొన్నారు.

-కేసు వివరాలివీ..
2011లో జార్ఖండ్ లో రాంచీ-రార్ గవ్-జంషెడ్ పూర్ మధ్య 163 కి.మీల పొడవైన నేషనల్ హైవే-33 కాంట్రాక్టు పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. 1151 కోట్ల వ్యయంతో ఓవీటీ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఈ టెండర్ చూపించి మధుకాన్ సంస్థ కెనరా బ్యాంకు కన్సార్టియం నుంచి 1029.39 కోట్లు అప్పు తీసుకుంది. తర్వాత మధుకాన్ పై అవకతవకల ఆరోపణలు రావడంతో నిజలేంటో తేల్చాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. విచారణలో 264.01 కోట్లు పక్కదారి పట్టాయని నివేదికలో తేలింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మధుకాన్ గ్రూప్, డైరెక్టర్లు, ఎండీపై కేసులు పెట్టారు. మనీల్యాండరింగ్ ఆరోపణలురావడంతో ఈడీ దర్యాప్తు చేస్తోంది.