Begin typing your search above and press return to search.
టీడీపీ `మెట్రో` మాయ బట్టబయలు!
By: Tupaki Desk | 9 Feb 2018 12:36 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు పాటుపడుతున్నాను.....ఏపీలో పెట్టుబడుల కోసం కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాను.....అమరావతిని ప్రపంచస్థాయి రాజధాని చేసేవరకు నిద్రపోను....ఇవన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేమన పద్యాల్లాగా వల్లెవేస్తుంటారు. అదేకోవలో అమరావతిలో మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టబోతున్నామని.....కాదుకాదు....లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టబోతున్నామని కొంతకాలంగా చంద్రబాబు అండ్ కో పాట పాడుతున్నారు. అసలింతకీ ఆ ప్రాజెక్టు వెనుక మతలబు తెలుసుకోవడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్య సభలో ఆ ప్రస్తావన తెచ్చారు. దీంతో, ఆ ప్రాజెక్టు గురించి కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు, అమరావతిలో మెట్రో కాదుకదా...లైట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి తమ దగ్గర ఎటువంటి ప్రతిపాదనలు లేవని కేంద్రం తేల్చి చెప్పేసింది. దీంతో, చంద్రబాబు అండ్ కో ఆడుతున్న `మెట్రో` మాయ బయటపడింది.
అమరావతిలో మెట్రో రైలు - లైట్ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ప్రతిపాదన లేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఆ విషయంపై కేంద్రం స్పష్టతనివ్వడంతో టీడీపీ డ్రామా బట్టబయలైంది. మెట్రో రైలు రాలేదంటూ టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేయడం హాస్యాస్పదం. ప్రతిపాదనలే లేకుండా కేంద్రం ప్రాజెక్టును ఎలా మంజూరు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ప్రధానమంత్రి మాతృ వందనం పథకం(పీఎంవీవై) అమలుపై విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో దాని అమలు నామమాత్రంగా ఉన్నట్టు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా మహారాష్ట్రలో అత్యధికంగా 50,831 మంది గర్భిణిలు, -బాలింతలైన తల్లులు లబ్ది పొందారు. జార్ఖండ్ - ఛత్తీస్ ఘఢ్ ల కన్నా తక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2,352 మంది మాత్రమే లబ్ది పొందారు. గర్భిణిలు - బాలింతల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ. 5 వేలు అందజేస్తుంది.