Begin typing your search above and press return to search.
చైనా పెడసరానికి చెప్పుదెబ్బ కొట్టిన భారత్
By: Tupaki Desk | 6 July 2017 4:10 PM GMTవాతావరణం వేడి వేడిగా ఉన్నప్పుడు.. దాన్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తుండటం మామూలే. అయితే.. నిండైన మూర్ఖత్వం.. అంతకు మించిన దుష్టబుద్ధితో నిండిన డ్రాగన్ లాంటి దేశం నుంచి మంచి మాటలు ఆశించటం అత్యాశే అవుతుంది. భారత్.. చైనా మధ్య ఇటీవల నడుస్తున్న మాటల యుద్ధం నేపథ్యంలో.. ఇష్యూను క్లోజ్ చేయటానికి అత్యున్నత స్థాయిలో భేటీలు కావటం బాగుంటుంది. అయితే.. అలాంటి ఆలోచనలు లేకపోగా.. భారత్ ను మరింత రెచ్చగొట్టి.. అవమానించేందుకు సైతం వెనుకాడటం లేదు చైనా.
సిక్కిం సరిహద్దుల్లో కొద్దిరోజులుగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వేళ.. రేపటి (శుక్రవారం) నుంచి జర్మనీలోని హాంబర్గ్ లో జీ 20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు భారత ప్రధాని మోడీతో పాటు.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా హాజరు కానున్నారు.
అయితే.. ఇలాంటి తటస్థ వేదికల మీద ఇద్దరు అధినేతలు భేటీ అయితే ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తాయని కొందరు ఆశిస్తున్నారు. చర్చలకు సంబంధించి భారత్ నుంచి ఎలాంటి ప్రతిపాదన లేనప్పటికీ.. తన మాటలతో కెలికే ప్రయత్నం చేసింది. తాజా పరిస్థితుల్లో భారత ప్రధాని మోడీతో తమ దేశాధ్యక్షుడు జీ జిన్ పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం లేదంటూ చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకటి ప్రకటించారు. నిజానికి.. చర్చలు జరిపేందుకు భారత్ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే.. చైనా అధికారుల నోటి నుంచి ఈ తరహా మాటలు రావటం గమనార్హం.
చైనా చావు తెలివితేటలకు భారత్ అధికారులు చెప్పుదెబ్బ లాంటి మాటలతో రిటార్ట్ ఇచ్చారు. తాము జీ జిన్ పింగ్ తో చర్చలు జరిపేందుకు అవకాశం ఇవ్వాలని అస్సలు అడగలేదని.. అలాంటప్పుడు చర్చలు గురించి మాటే లేదని నరేంద్ర మోడీ బృందంలోని సభ్యుడైన ఒక అధికారి ఒకరు తేల్చి చెప్పినట్లుగా ఒక ఆంగ్ల మీడియా పేర్కొంది. మోడీ.. పింగ్ ల మధ్య మీటింగ్ కు సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదని చెప్పటం ద్వారా.. చైనా చావుబుద్ధికి భారత్ సరైన సమాధానం చెప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.