Begin typing your search above and press return to search.
పాక్ కు న్యూ ఇయర్ షాకిచ్చిన ట్రంప్
By: Tupaki Desk | 1 Jan 2018 4:39 PM GMTకొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు పెద్ద షాకిచ్చారు. పాకిస్థాన్ కు అన్ని రకాల సహాయాలను నిలిపివేస్తున్నట్లు ట్వీట్ చేశారు. గత 15 ఏళ్లుగా పాకిస్థాన్ కు అనవసరంగా 33 బిలియన్ డాలర్లకు పైగా సాయం చేశామన్నారు. పాకిస్థాన్ పచ్చి అబద్దాలకోరు అని ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కొత్త సంవత్సరం మొదటిరోజే చేసిన ట్వీట్ లో పాక్ పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ పాకిస్తాన్ తమ దేశ నేతలను ఫూల్స్ గా భావించిందని వ్యాఖ్యానించారు. `పాక్ ను నమ్మితే.. మాకు అబద్దాలు మాత్రమే మిగిలాయి. ఒక పక్క పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంటే మేం మాత్రం ఆఫ్ఘనిస్తాన్ లో వారి కోసం వెతికాం` అంటూ వాపోయారు. ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు ఇచ్చే నిధులను పాక్ పక్కదారి పట్టించిందని ట్రంప్ ఆరోపించారు. పాకిస్థాన్‌కు అనవసరంగా 33 బిలియన్ డాలర్ల సాయం చేశామన్నారు. ఇక పాక్‌కు ఒక్క పైసా కూడా సహాయం చేయమని వెల్లడించారు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం సమయంలో పాకిస్థాన్ సాయం తీసుకొని అమెరికా దాడులు నిర్వహించింది. ఇటీవల కూడా పాకిస్తాన్ తమకు నమ్మదగిన మిత్రుడని ప్రకటించింది. అయితే, సడెన్ గా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లలో ట్రంప్ విరుచుకుపడ్డారు. కాగా, ట్రంప్ ట్వీట్ పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. నిజాలకు, కల్పనలకు మధ్య వాస్తవాలేంటో ప్రపంచం తెలుసుకోవాలన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో స్పందిస్తామని ఆసిఫ్ ట్వీట్ చేశారు.