Begin typing your search above and press return to search.
ఇక ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు: వెంకయ్య హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 24 Aug 2022 10:30 AM GMTతెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిష్ణాతుడిగా, దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు మొదటి వారంలో ముగిసిన సంగతి తెలిసిందే. ఆయనకు రాష్ట్రపతిగా లేదంటే మరోమారు ఉపరాష్ట్రపతిగా కొనసాగిస్తారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడుకు ఆయన మిత్రులు పెద్దాయనకు ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఇక తాను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. ఇకపై తాను రాజకీయ నాయకుడిని కాదని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవని.. ఎవరినైనా కలవవచ్చని సంతోషం వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకుడిగా తన కెరీర్ ముగిసినా... ప్రజా జీవితంలో మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తానని, రాజకీయాలు సహా పలు అంశాలపై ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని వెంకయ్య నాయుడు చెప్పారు.
తాను ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం.. ఎవరిని పడితే వారిని కలవడానికి కుదరదని.. అలాగే ఏది పడితే అది మాట్లాడటానికి వీలు కాదని తెలిపారు. ఆ పదవికి తాను కట్టుబడవలసి వచ్చిందని.. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం రాలేదన్నారు.
ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొంటానని చెప్పిన వెంకయ్య... తన అనుభవాలను, ఎన్నో ఏళ్లుగా నేర్చుకున్న పలు విషయాలను యువత, మహిళలు, రైతులతో పంచుకుంటానని చెప్పారు. అలాగే వారి ద్వారా తనకు తెలియని విషయాలను కూడా తెలుసుకుంటానన్నారు.
రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని వెంకయ్య నాయుడు కోరారు. ముఖ్యంగా ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించకూడదన్నారు. దూషిస్తూ మాట్లాడితే తప్ప తమను ప్రజలు గుర్తు పెట్టుకోరని, దూషించకపోతే ప్రజా జీవితంలో వెనుకబడిపోతామని భావించడం అత్యంత ప్రమాదకరమని వెంకయ్య నాయుడు చెప్పారు.
మనం వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలని వెంకయ్యనాయుడు కోరారు. అందరూ దూషిస్తూ మాట్లాడుతున్నారని తాను అనడం లేదన్నారు. అయితే అలాంటి వారికే ఎక్కువ ప్రచారం లభిస్తోందన్నారు. మీడియా కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నిర్మాణాత్మకంగా మాట్లాడేవారిని, మంచి భాష మాట్లాడేవారిని ప్రజలు, పత్రికలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. కొంతమంది చేస్తున్న చర్యలు ఇతరులకు అనుసరణీయం కాకూడదని ఆకాంక్షిస్తున్నానన్నారు.