Begin typing your search above and press return to search.
సొమ్ములు అయిపోనాయ్.. మరేటి సేత్తాం!
By: Tupaki Desk | 2 Jan 2018 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కనీసం రాజధాని - రెవెన్యూలోటు లాంటి విషయాల్లో కూడా ఉదారంగా సహకరించే ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని కనబరుస్తూ ఉన్న సంగతి అందరికీ కనిపిస్తూనే ఉంది. చంద్రబాబునాయుడు ఒకవైపు డిజైన్ల మీద డిజైన్లు తయారు చేయిస్తూ ఆ దశలోనే వందల కోట్ల రూపాయలు సెలవు చేసేస్తూ... అసలు నిర్మాణాలకు సొమ్ములు ఎక్కడినుంచి తెస్తారోననే సందిగ్ధతలో ప్రజలను ముంచేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. అమరావతి నిర్మాణాల కోసం.. కేంద్రం ఇప్పటిదాకా ఇచ్చిన 1500 కోట్ల రూపాయలు ఇచ్చిందని... దానికి మించి ఇప్పటికే అక్కడ నిర్మాణాల కోసం ఖర్చు పెట్టేశాం అని చంద్రబాబు సర్కారు కేంద్రానికి నివేదిక ఇచ్చిందిట. అమరావతిలో ఇప్పటిదాకా ఒక్క ఇటుక కూడా పడింది లేదు. అలాంటిది.. కేంద్రంనుంచి వచ్చిన సొమ్మలన్నీ అయిపోనాయ్ అని స్టేటు గవర్నమెంటు అంటోంది. మరైతే.. ఏంటి దారి?
వివరాల్లోకి వెళితే.. విభజన చట్టం ప్రకారం.. అసెంబ్లీ - సచివాలయం - హైకోర్టు భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలి. ఈ మూడింటికి కలిపి.. 1500 కోట్లు ఇచ్చాం అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. అయితే ఈ సొమ్ములు మొత్తం ఆ నిర్మాణ పనులకు ఖర్చు పెట్టేసినట్లుగా చంద్రబాబు సర్కారు కేంద్రానికి లేఖ రాసేసిందిట. ఇప్పటిదాకా అసలు అమరావతిలో ఒక్క నిర్మాణం అయినా జరగని నేపథ్యంలో.. బాబు సర్కార్ ఉద్దేశం బహుశా వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి ఖర్చు పెట్టేశారేమో అని అంతా అనుకుంటున్నారు.
కేంద్రంనుంచి రాగల - వచ్చే అవకాశం ఉన్న నిధులు మొత్తం తాత్కాలిక నిర్మాణాలకు తగలేసేస్తే.. ఇక అసలు నిర్మాణాల విషయం వచ్చేసరికి నిధులు ఎక్కడినుంచి పోగేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పెరిగేలా.. కొత్త నిర్మాణాల ఆర్థిక వ్యయం స్టేట్ మీదనే పడుతుందేమో అనే ప్రచారం కూడా జరుగుతోంది.
పైగా ఒకవైపు కేంద్రం ఆర్థిక సహాయ మంత్రి ‘మేం ఇవ్వాల్సింది ఇచ్చేశాం’ అంటుండగా.. మరోవైపు 1500 కోట్ల నిదులు ఇస్తే 1580 కోట్లు ఖర్చయిపోయినట్లుగా బాబు సర్కార్ లెక్కలు సమర్పించిందిట. ఈ సొమ్ము మొత్తం ఇప్పుడే ఖర్చయిపోతే.. అసలు నిర్మాణానికి అప్పులే గతి. అయితే.. ఆ అప్పులు కూడా అంత ఈజీ కాదు. అమరావతికి 3324 కోట్ల రుణం ఇవ్వాలనే ప్రతిపాదన ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు పరిశీలనలోనే ఉన్నదని.. కేంద్రం ఆర్థికమంత్రి జైట్లీ సభలోనే చెప్పేశారు. మరి, ఇప్పటిదాకా అతీగతీ లేని పరిస్థితుల్లో రాజధాని నిర్మాణాలను చంద్రబాబు ఎలా చక్కబెడతారో ఏమో చూడాలి.