Begin typing your search above and press return to search.

వారికీ ఇక అమెరికాకి వచ్చే యోగం లేనట్టే : ట్రంప్!

By:  Tupaki Desk   |   11 April 2020 2:00 PM GMT
వారికీ ఇక అమెరికాకి వచ్చే యోగం లేనట్టే : ట్రంప్!
X
ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో విషాదాన్ని నింపుతున్న మ‌హ‌మ్మారి క‌రోనా.. అగ్ర‌రాజ్యం అమెరికాలో మరణ మృదంగం మోగిస్తోంది. అమెరికాలో కరోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య‌ రోజురోజుకి మ‌రింత వేగంగా పెరిగిపోతుంది. ఇప్ప‌టికే అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య 5 ల‌క్ష‌లు దాటిపోయింది. సుమారు 18,761 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో అమెరికాలో ఉన్నవారు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్‌ లో శవాలు కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. ఒక్క న్యూయార్క్ సిటీలోనే ఇప్ప‌టివ‌ర‌కు 172,358 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా, 7,844 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీనిపై అమెరికా అధినేత ట్రంప్ మాట్లాడుతూ ..అమెరికా లో కరోనా ను అరికట్టడానికి శతవిధాలా పోరాడుతున్నాం అని ,సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్రాణ నష్టం త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిండెంట్ ట్రంప్ ..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో రోజురోజుకీ క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న సమయంలో అమెరికాలో ఉంటున్న విదేశీయుల‌ను స్వ‌దేశాల‌కు తీసుకెళ్ల‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న దేశాల‌పై ఆంక్ష‌లు విధిస్తామ‌ని, ఆయా దేశాల నుంచి వ‌చ్చే పౌరుల‌కు వీసా ఇవ్వ‌బోమ‌ని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.

అలాగే ,ఇతర దేశాల్లో ఉన్న తమ పౌరులు, అమెరికా జాతీయులను స్వదేశానికి రానీయకుండా.. వీసా మంజూరును నిలిపివేయడం.. లేదా ఉద్దేశపూర్వకంగా మంజూరులో ఆలస్యం చేస్తున్న దేశాలపై కూడా వీసా నిబంధనల విషయమై కఠినంగా ఉంటామని ట్రంప్‌ తెలిపారు. దీనిపై హోంల్యాండ్ సెక్యూరిటీ త్వ‌ర‌లోనే ఆయా దేశాల‌కు నోటీసులు జారీ చేస్తుంద‌ని తెలిపారు.