Begin typing your search above and press return to search.
రైల్వే బడ్జెట్ కు మోడీ చెల్లుచీటీ
By: Tupaki Desk | 22 Jun 2016 6:59 AM GMTబలమైన అధినేతల చేతికి అధికారం చేజిక్కితే వారెలా వ్యవహరిస్తారనటానికి ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు నిలువెత్తు నిదర్శనాలుగా చెప్పొచ్చు. సంప్రదాయాలు.. విధానాల్ని వదిలేసి.. తమదైన ముద్ర వేసేందుకు వారు విపరీతంగా తహతహలాడిపోతారు. ప్రధాని మోడీ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి చటుక్కున వెళ్లి వస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో సవాలచ్చ సమస్యలు ఉన్నా.. వాటి మీద పెద్దగా దృష్టి పెట్టని కేసీఆర్.. వెయ్యి కోట్ల వ్యయంతో తెలంగాణ సచివాలయాన్ని పునర్నిర్మించటం.. సీఎం క్యాంప్ ఆఫీసును కొత్తగా నిర్మించటం లాంటివి ఉదాహరణలుగా చెప్పొచ్చు.
ఇవన్నీ ఎందుకంటే.. తమ మార్క్ కనిపించాలన్న తహతహ తప్పించి.. వ్యవస్థ మొత్తంలో మార్పులు తెచ్చే ఉద్దేశం కాదనే చెప్పొచ్చు. కేసీఆర్ ను వదిలేసి మోడీ వ్యవహారంలోకి వెళితే.. ప్రణాళికా సంఘాన్ని తీసి అవతల పారేసి.. నీతి ఆయోగ్ ను తెర మీదకు తీసుకొచ్చి.. దానికి పెద్దపీట వేయటం.. అదిచ్చే సూచనలకు మోడీ పెద్దపీట వేయటం కనిపిస్తుంది. పాలనతో పాటు.. విధానపరమైన అంశాల్లో సంస్కరణలు తీసుకురావాలని.. వాటిపై తన ముద్ర స్పష్టంగా కనిపించాలని భావిస్తున్న మోడీ.. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్న సంగతి.
కేంద్రంలో తనకు సంపూర్ణమైన బలం ఉండటం.. తనను ఢీ కొట్టే మొనగాడు లాంటి నేత కనుచూపు మేర లేని నేపథ్యంలో తాను చేయాల్సినవన్నీ చేసేయాలన్న పట్టుదలతో మోడీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకేనేమో.. ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించని కొత్త కొత్త ఆలోచనల్ని ఆయన తెర మీదకు తేనున్నారు. ఇందులో భాగమే ప్రతి ఏటా సాధారణ బడ్జెట్ ముందు ప్రవేశ పెట్టే రైల్వే బడ్జెట్ కు చెల్లుచీటి ఇవ్వటం. మోడీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నుంచి రైల్వే బడ్జెట్ రంగు.. రుచి.. వాసనను పూర్తిగా తీసి పారేసిన ఆయన.. తాజాగా రైల్వే బడ్జెట్ కు మంగళం పాడాలని భావిస్తున్న మోడీ అందుకు తగ్గట్లుగా పావుతు కదుపుతున్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందించిందని.. దాని ప్రకారం బ్రిటీష్ పాలకుల నుంచి సంక్రమించిన రైల్వే బడ్జెట్ ను ఇప్పటికి అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా చెబుతున్నారు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో వీలీనం చేసేందుకు ఏమేం చేయాలో సూచిస్తూ ఒక రిపోర్ట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. రైల్వే బడ్జెట్ కు మంగళం పాడేయాలని కూడా బలంగా సూచించిందని చెబుతున్నారు. తనదైన మార్క్ ను చూపించాలని తహతహలాడే మోడీ.. రైల్వే బడ్జెట్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.