Begin typing your search above and press return to search.
ఫ్రీగా ఇస్తున్నా మల్లిబాబు లడ్డూ వద్దంట
By: Tupaki Desk | 25 Jun 2016 7:53 AM GMTవినాయకచవితి వస్తుందంటే చాలు.. హైదరాబాద్ లోని గణేశ్ మండపాల హడావుడి అంతా ఇంతాకాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసే భారీ గణేషుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. భారీ గణేషుడితో పాటు.. స్వామి చేతుల్లో పెట్టే భారీ లడ్డూ భక్త జనాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటివరకూ ఖైరతాబాద్ గణేషుడికి వినియోగించే లడ్డూ ప్రసాదాన్ని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు తయారు చేసి పంపించటం ఒక అలవాటుగా మారింది.
ఆరేళ్ల క్రితం 2010లో మల్లిబాబు తొలిసారి 500 కేజీల లడ్డూను ఉచితంగా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా లడ్డూ బరువును పెంచుతూ వస్తున్నారు. అలా పెరుగుతూ వచ్చిన లడ్డూ 2013 నాటికి 5వేల కేజీలకు చేరుకుంది. అయితే.. ఆ ఏడాది భారీ వర్షం కారణంగా లడ్డూ తడిచిపోయి పాడైపోవటంతో.. విగ్రహంతో పాటు.. లడ్డూను నిమజ్జనం చేశారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఆరు వేల కేజీల లడ్డూను మల్లిబాబు తయారు చేసి పంపారు. ఇందుకోసం దాదాపు రూ.18 లక్షల నుంచి రూ.20లక్షల మధ్య ఖర్చు అవుతుందని చెబుతారు.
అయితే.. ఈసారి పరిస్థితి మారింది. ఖైరతాబాద్ గణేశుడికి మల్లిబాబు పంపే లడ్డూ రాదని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి చెబుతోంది. ఈసారి మల్లిబాబు నుంచి లడ్డూ తీసుకోవటం లేదని.. దానికి బదులు ఇక్కడే చేయిస్తామని.. లడ్డూ బరువు కూడా 5 టన్నులు మాత్రమే ఉండాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. సిటీ నుంచి కానీ తెలంగాణ జిల్లాల నుంచి కానీ ఎవరైనా లడ్డూ స్పాన్సర్ చేస్తామంటే పరిశీలిస్తామంటూ గణేశ్ ఉత్సమ కమిటీ సభ్యుల మాటలు వింటుంటే.. దేవుడి కార్యక్రమంలో ఈ ‘లెక్క’లేంటన్న భావన కలగక మానదు. ఓవైపు ఉచితంగా ఇస్తామన్న వారిని వద్దని చెబుతూ.. మరోవైపు స్పాన్సర్ల కోసం వెతుకులాట చిత్రంగా అనిపించట్లేదు..?