Begin typing your search above and press return to search.

ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే ముద్దు.. అంటున్న వారెవరో తెలుసా..?

By:  Tupaki Desk   |   29 Jan 2022 3:30 PM GMT
ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే ముద్దు.. అంటున్న వారెవరో తెలుసా..?
X
ఢిల్లీని వదిలి హైదరాబాద్ కే పరిమితం కావాలని చూస్తున్నారు ఆ ఎంపీలు.. ప్రధానితో కాదు.. కేసీఆర్తో ఉంటూ.. ఆయనను ఢీకొట్టేందుకు అసెంబ్లీకి వెళ్లాలని తహతహలాడుతున్నారు. ఎంపీ పదవి వద్దని ఎమ్మెల్యే పదవి ఆశిస్తున్నారు ఆ ఎంపీలు.. ఎవరో ఒకసారి చూద్దాం..

దేశంలో శాసనసభ, లోక్ సభ వేదికలు దేశాన్ని పాలిస్తాయి. ఇందులోని సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతారు. అసెంబ్లీకి ఎన్నికయ్యే వారిని ఎమ్మెల్యేలుగా.. లోక్ సభ కు ఎన్నికయ్యే వారిని ఎంపీలుగా గుర్తించి సభలకు పంపుతారు. అయితే అసెంబ్లీకి ఎన్నికైన వారు ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతారు. కానీ ఎంపీగా గెలిచిన వారు మాత్రం ఏడు వరకు అసెంబ్లీల్లో తిరగగలుగుతారు. ఎంపీలుగా ఎన్నికైన వారికి ఢిల్లీతో సత్సంబంధాలు ఉంటాయి.అవసరమనుకుంటే ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం రాష్ట్రానికే పరిమితం అవుతారు.

కానీ తెలంగాణలో మాత్రం ఎంపీలుగా గెలిచిన వారు తమ పదవుల్లోఉండడానికి ఇష్టపడడం లేదట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో 16 మంది ఎంపీలుగా ఉండగా.. ఇందులో దాదాపు 10 మంది వరకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ 10 మంది ఎవరో చూద్దాం..

బీజేపీ రాష్ట్ర అధ్యక్సుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచే ఓడిపోయారు. దీంతో 2018లో ఎంపీగా పోటీ చేయడంతో గెలుపొందారు. అయితే 2023 ఎన్నికల్లో కరీంనగర్ లేదా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ధర్మపురి అరవింద్ నిజమాబాద్ ఎంపీగా 2019లో ఎన్నికయ్యారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇంట్రెస్టు చూపుతున్నారు. రాష్ట్రంలో పార్టీ హవా పెరుగుతుండడంతో ఆర్మూరు లేదా హైదరాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సీకింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి సైతం అదే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఆయన అంబర్ పేట నియోజకవర్గంపై ఎక్కువగా ఇంట్రెస్టు చూపుతున్నారు. గతంలోఆయన పలుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరో బీజేపీ ఎంపీ సోయం బాపురావు సైతం బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన ఈ నియోజకవర్గం నంచిపోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎంపీగా గెలిచారు. అయితే అసెంబ్లీలో ఉంటే కేసీఆర్ తో డైరెక్టుగా ఢీకొట్టే అవకాశం ఉందని వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్ రావు కూడా ఎమ్మెల్యే అయితేనే బెటరని అనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే మాలోతు కవిత తన తండ్రి నియోజకవర్గం డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంటకరెడ్డిలు సైతం అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనా 2019లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే అయన మళ్లీ హుజూర్ నగర్ వెళ్లాలని భావిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం