Begin typing your search above and press return to search.
బాబుకు ఏపీలో అసెంబ్లీ ఓటమి కంటే దారుణ పరాభవం
By: Tupaki Desk | 23 May 2019 8:19 AM GMTరాజకీయాలు కానీ ఆటలు కానీ.. పోటీ ఏదైనా గెలుపోటుమలు కామన్. కానీ.. ఓటమిలోనూ గౌరవ ఓటమి ఒకటి ఉంటుంది. దానికి కూడా అర్హత లేదన్నట్లుగా టీడీపీ అధినేతకు దారుణ పరాభవం మిగిలేలా చేశారు ఏపీ ఓటర్లు. అసెంబ్లీ.. ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ లో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాభవం టీడీపీ అభ్యర్థులకు ఎదురుకాగా.. ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బాబు తలెత్తుకోలేని రీతిలో ఓటమి ఎదురైంది. ఆయన రాజకీయ కెరీర్ లో ఇంతటి దారుణమైన పరాభవం మరెప్పుడూ ఎదుర్కొని ఉండలేదని చెప్పాలి.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. తాజాగా ఓట్ల లెక్కింపును చూస్తే.. ఇప్పటివరకూ 152 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధిక్యతలో ఉంటే.. కేవలం 23 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు అధిక్యతలో ఉన్నారు. పవన్ నేతృత్వంలోని జనసేన ఖాతా కూడా తెరవని పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలోని పాతిక ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే.. షాకింగ్ గా ఉన్నాయి. అధికార టీడీపీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం లేకపోవటం గమనార్హం. అదే సమయంలో జగన్ పార్టీకి పాతిక్కి పాతిక ఎంపీ స్థానాల్ని కట్టబెడుతూ ఏపీ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అనూహ్యంగా మారింది. ఒక్క ఎంపీ కూడా చేతిలో లేని దారుణ పరిస్థితిని బాబు ఎదుర్కొన్నారని చెప్పాలి.
ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ హడావుడి చేసిన బాబుకు.. ఇప్పుడు ఒక్క ఎంపీ కూడా లేకపోవటానికి మించిన అవమానం మరొకటి ఉండదనే చెప్పాలి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఇంతటి దారుణమైన పరిస్థితి మరెప్పుడూ ఎదురుకాలేదు. ఒకప్పుడు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఘనత టీడీపీ సొంతం. అలాంటి పార్టీ ఈ రోజున లోక్ సభలో తన ప్రాతినిధ్యమే లేని పరిస్థితిలోకి వెళ్లాటానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదని చెప్పక తప్పదు.