Begin typing your search above and press return to search.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ర్వాత ఏం జ‌రిగింది చెప్తున్న మోడీ

By:  Tupaki Desk   |   26 Jun 2017 12:57 PM GMT
స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ర్వాత ఏం జ‌రిగింది చెప్తున్న మోడీ
X
అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదంపై ఘాటుగా స్పందించారు. శాంతిని, సాధార‌ణ జీవితాన్ని నాశ‌నం చేస్తున్న ఉగ్ర‌వాద నిజ‌స్వ‌రూపాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డంలో భార‌త్ విజ‌య‌వంత‌మైందని మోడీ అన్నారు. అందుకే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ లో ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై స‌ర్జిక‌ల్ దాడులు చేసిన‌ప్పుడు ఏ దేశం భార‌త్‌ ను ప్ర‌శ్నించ‌లేద‌ని ఆయ‌న చెప్పారు.

వ‌ర్జీనియాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్‌-అమెరిక‌న్స్‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించారు. త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డానికి ఇండియా ఎంత‌వ‌ర‌కైనా వెళ్తుంద‌ని స‌ర్జిక‌ల్ దాడుల ద్వారా నిరూపిత‌మైంద‌ని మోడీ స్ప‌ష్టంచేశారు. ``20 ఏళ్ల కింద‌ట మేము ఉగ్ర‌వాదం గురించి మాట్లాడిన‌పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అది శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య అన్నారు. కానీ ఇప్పుడు ఉగ్ర‌వాదులే ప్ర‌పంచానికి ఉగ్ర‌వాద‌మంటే ఏంటో చూపించారు`` అని ప్ర‌ధాని అన్నారు. ``స‌ర్జిక‌ల్ దాడుల‌తో ఇండియా స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. నిగ్ర‌హంగా ఉండే భార‌త్‌.. అవ‌స‌ర‌మైతే త‌న స‌త్తా చాటుతుంద‌ని, ఉగ్ర‌వాదం నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డం ఎలాగో తెలుస‌ని ప్ర‌పంచం గుర్తించింది`` అని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అన‌డంతో అక్క‌డి ఆడిటోరియం చ‌ప్ప‌ట్లతో మార్మోగింది. స‌ర్జిక‌ల్ దాడుల‌ను ఏ దేశం ప్ర‌శ్నించ‌లేద‌ని, దాని బారిన ప‌డిన దేశం సంగ‌తి వేరే అని ప్ర‌ధాన‌మంత్రి చెప్ప‌డంతో అక్క‌డున్న‌వారంతా ఒక్క‌సారిగా న‌వ్వారు.

ఈ సంద‌ర్భంగా ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన మ‌రో దేశం చైనా ల‌క్ష్యంగా కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికి ప్ర‌పంచ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే సంస్కృతి ఇండియాకు లేద‌ని మోడీ అన్నారు. ద‌క్షిణ చైనా స‌ముద్రం విష‌యంలో చైనా అనుస‌రిస్తున్న తీరుపై ఆయ‌న ఇలా స్పందించారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డే ఇండియా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, వ‌సుధైక కుటుంబం అన్న ఆద‌ర్శాన్ని తాము పాటిస్తామ‌ని మోడీ స్ప‌ష్టం చేశారు. కాగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగానికి విశేష స్పంద‌న ల‌భించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/