Begin typing your search above and press return to search.
సారీ.. అవుటాఫ్ కవరేజ్ ఏరియా
By: Tupaki Desk | 24 July 2015 5:30 PM GMTఇప్పుడు అమరావతి పేరు దేశ విదేశాల్లో మారుమోగుతోంది. అద్భుత రాజధాని ఆవిష్కరణకు రంగం సిద్ధమవుతోంది. కానీ, నయా రాజధానిలో ఇప్పటికీ సెల్ ఫోన్ సిగ్నళ్లు మాత్రం ఏమాత్రం పని చేయడం లేదు. సర్వీసు ప్రొవైడర్లు దీనిపై చిన్నచూపు చూస్తున్నారు. రాజధాని ప్రకటించకముందు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్నే ఇప్పుడు కూడా చూపుతున్నారు.
మూడు మండలాలు 29 గ్రామాల్లో నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో ఇప్పటికీ సరైన సెల్ ఫోన్ నెట్ వర్క్ లేదు. కొత్త కొత్త హోటళ్లు వస్తున్నాయి. ఖరీదైన కార్లు వస్తున్నాయి. ఖరీదైన సెల్ ఫోన్లలో ఎంతోమంది కోట్ల లావాదేవీలు జరుపుతున్నారు. కానీ, లావాదేవీలు జరపడానికి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇక్కడికి వెళితే మాత్రం సెల్ ఫోన్లు పని చేయని పరిస్థితి. ఇక్కడ బీఎస్ఎన్ఎల్ మొబైళ్లు సైతం మొరాయిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత రియల్ ఎస్టేట్ తోపాటు పలు వ్యాపారాల జోరు పెరిగింది. మంత్రులు, అధికారుల రాక ఇక్కడికి పెరిగింది. తాజా పరిస్థితుల్లో బ్యాంకులు, ఆటోమొబైల్ కంపెనీలు కూడా వచ్చాయి. ఖరీదైన ఫోన్ల కొనుగోళ్లు పెరిగాయి. గతంతో పోలిస్తే ఫోన్లు కూడా పెరిగాయి. కానీ, మొబైల్ ఫోన్ కంపెనీలు మాత్రం ఇక్కడ టవర్లను ఏర్పాటు చేయాలని ఆలోచించడం లేదు. దాంతో ఖరీదైన ఫోన్లు ఉండి కూడా అవి పని చేయడం లేదు. దాంతో సెల్ ఫోన్ సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలనే డిమాండ్లు ఇక్కడ పెరుగుతున్నాయి.