Begin typing your search above and press return to search.
రూ.2000 నోటు ముద్రణపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ..!
By: Tupaki Desk | 10 Nov 2022 2:30 AM GMTకేంద్రంలో మోదీ సర్కార్ మొదటి సారి అధికారంలోకి వచ్చాక పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2016 నవంబర్ 8న రూ.500.. రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ఆకస్మికంగా ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత ప్రజలంతా చిన్న నోట్ల కోసం బ్యాంకులు.. ఏటీఎం ముందు కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ సంఘటనను దేశ ప్రజలెవరూ కూడా మరిచిపోలేరు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం బయటికి వస్తుందనే నమ్మకంతో ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నాడు సహకరించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని పక్కన పెడితే గత మూడేళ్లుగా రెండు వేల నోటు ఎక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు.
రూ.500.. రూ. 1000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా 2వేల రూపాయల నోటును తీసుకొచ్చింది. అయితే దీని వల్ల చిల్లర సమస్య ఏర్పడింది. అప్పటి కేవలం రూ. 100లోపు నోట్లు.. చిల్లర కాయిన్స్ మాత్రమే చలామణిలో ఉండేవి. ఎవరైనా రూ. 2వేల నోటు ఇస్తే దానికి చిల్లర ఇవ్వడం వ్యాపారస్తులకు చాలా ఇబ్బందిగా మారింది.
అయితే ఆ తర్వాత రూ.200 నోటును ఆర్బీఐ తీసుకొచ్చింది. దీంతో కొంతమేరకు సమస్యకు పరిష్కారం లభించింది. అలాగే డిజిటల్ పేయింట్స్ సైతం అందరికీ అందుబాటులోకి రావడంతో చిల్లర సమస్య చాలావరకు తీరింది. అయితే గత మూడేళ్ల కాలంలో 2వేల నోటు చలామణిలోకి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పెద్ద నోట్ల అన్నింటిని రాజకీయ నాయకులు.. బడా వ్యాపారులు బ్లాక్ చేశారనే ప్రచారం జరిగింది. గత మూడేళ్ల కిందటి వరకు కూడా ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటే కచ్చితంగా 2వేల నోటు వచ్చేది. అయితే గత ఆరు నెలలుగా రెండు వేల నోటు ఏటీఎంలలో ఎక్కడా కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది.
ఈ క్రమంలోనే రెండు వేల నోటును ఆర్బీఐ రద్దు చేయబోతుందనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. ఈ విషయంపై సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త జలగం సుధీర్ సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ నుంచి వివరణ కోరాడు. దీనిపై ఆర్బీఐ స్పందిస్తూ 2 వేల నోటును ముద్రణను నిలిపివేసినట్లు తెలిపే గణాంకాలను అతడికి పంపించింది.
అయితే రెండు వేల నోటును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ఆ లేఖలో ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం. ఇక 2వేల నోటు ముద్రణ మూడేళ్లుగా చేయడం లేదనే విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. 2016-17లో రూ. 354.29 కోట్లు.. 2017-18లో రూ. 11.15 కోట్లు.. 2018-19లో రూ. 4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించినట్లు పేర్కొంది. ఇక 2019-20 లో ఒక్క కొత్త నోటును కూడా ముద్రించలేదని ఆర్బీఐ వెల్లడించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.