Begin typing your search above and press return to search.
ఈ బడ్జెట్ లో రైల్వేది కొత్త రికార్డ్
By: Tupaki Desk | 1 Feb 2017 1:34 PM GMT2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొత్త రికార్డు సృష్టించారు. రైల్వే బడ్జెట్ ను ఈసారి సాధారణ బడ్జెట్ లో కలిపి కొట్టడమే అనుకునేరు. అది ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వ ఘనతే. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే... తాజా బడ్జెట్ లో కొత్త రైళ్ల గురించి ఒక్క మాట కూడా లేదు. రైల్వే బడ్జెట్ అంటే సాధారణంగా ఎదురుచూసేది కొత్త రైళ్ల కోసమే. కొన్ని రైళ్లకు పొడిగింపు - మరి కొన్ని రైళ్లకు అదనపు బోగీలు కలపడం ఇలా ఎన్నో ఉండేవి. ప్రస్తుతం సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కలిపారు. కానీ ఆ బడ్జెట్ లో కొత్త రైళ్లు ఎన్ని వచ్చాయో చెప్పడం కష్టమే. ఇంకా చెప్పాలంటే ఒక్క రైలు కూడా లేదు. అసలు జైట్లీ తన ప్రసంగంలో కొత్త రైళ్ల ఊసే ఎత్తలేదు.
ఈ పరిణామంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. బడ్జెట్‌లో కొత్త రైళ్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదని, కొత్త రైళ్లతో బడ్జెట్ కు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. రైళ్లల్లో కోచ్ మిత్రా - బయో టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యాత్రా స్థలాలకు వెళ్లే రైళ్లను నడపాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్ ప్రసంగంలో నాలుగు కొత్త తరహా రైళ్లను ప్రకటించారు. కాగా, ఈ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ రూ. లక్షా 31 వేల కోట్లుగా ప్రకటించారు. ఇందులో మౌలిక వసతుల రంగానికి రూ. 3,96,135 కోట్లు - రైల్వేకు రూ. 55 వేల కోట్ల ప్రభుత్వ సాయం చేయనున్నట్లు తెలిపారు. 2020 నాటికి బ్రాడ్ గేజ్ మార్గాల్లో గేట్ల ఏర్పాటు - కొత్తగా మెట్రో రైలు పాలసీ తీసుకురానున్నామని వివరించారు. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సేవా పన్ను రద్దు - భద్రతకు పెద్దపీట వేస్తూ లక్ష కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని అరుణ్ జైట్లీ వివరించారు. కేవలం పర్యాటకం - తీర్థయాత్రల కోసమే ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నామని, 2017-18లో 25 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపడతామని తెలిపారు. ఐదు వందల స్టేషన్లలో లిఫ్టులు - ఎస్కలేటర్లు - 2000ల స్టేషన్లలో సోలార్ పవర్ - 2019 నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైలు విధానం - మెట్రో రైలు మార్గాల ఏర్పాటులో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/