Begin typing your search above and press return to search.
తెలంగాణ సీఎస్ పోస్టు.. గిరాకీనే లేదు?
By: Tupaki Desk | 18 Dec 2019 1:30 AM GMTతెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈనెల 31న రిటైర్ కాబోతున్నారు. ఆయన ప్లేసులో తెలంగాణ సీఎస్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. జోషి వారసుడిగా 14 మంది పేర్లను కేసీఆర్ పరిశీలించారని తెలిసింది. అయితే అధికార వర్గాలు మాత్రం కేసీఆర్ కింద పనిచేయడం వద్దే వద్దు అని సీఎస్ పోస్టుపై అయిష్టత చూపుతున్నారట..
తెలంగాణలో ఇప్పుడు సచివాలయం లేదు. కొత్త సచివాలయం భవనం కోసం కూల్చేసే పనిలో ఉన్నారు. బీఆర్కే భవన్ లో నిర్వహిస్తున్నారు. అక్కడ అరకొర వసతుల మధ్య అధికారులు అవస్థలు పడుతున్నారు.
ఇక కేసీఆర్ పరిపాలనలో సీఎస్ డమ్మీ అయిపోతున్నారన్న చర్చ అధికారవర్గాల్లో ఉంది. మొత్తం సీఎంవోనే పెత్తనం చెలాయిస్తోంది.కీలక సమీక్షలకు కూడా సీఎస్ ను పిలవని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. అందుకే అలాంటి డమ్మీ పోస్టు చేయమని అధికారులు అస్సలు ఇంట్రస్ట్ చూపించడం లేదట..
అధికార వర్గాల్లోనే అత్యున్నతమైన సీఎస్ పోస్టు దక్కకపోతే ట్రిబ్యునల్స్ ఆశ్రయించే అధికారులు ఉన్న ఈ కాలంలో తెలంగాణ సీఎస్ పోస్టుకు గిరాకీ లేకపోవడం వైచిత్యమే మరి..