Begin typing your search above and press return to search.

ఈటల.. బీజేపీలో ఒంటరి అయిపోయాడా?

By:  Tupaki Desk   |   23 Sep 2022 2:30 AM GMT
ఈటల.. బీజేపీలో ఒంటరి అయిపోయాడా?
X
ఉద్యమ నాయకుడు హిందుత్వ కాషాయ పార్టీలో చేరితే ఇమడగలడా? అని ముందునుంచే అందరూ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానమే నిజమైంది. టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయబడ్డ ఈటల రాజేందర్ ను నాడు కాంగ్రెస్ లోకి రావాలని...నీకు బీజేపీ సెట్ కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆయన ఇంటికెళ్లి మరీ కలిశాడు. ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది.

తెలంగాణ బీజేపీలో చేరాక మొదట అగ్రతాంబూలం దక్కిన ఈటలకు ఇప్పుడు వైరి వర్గాలుగా మారిన బీజేపీలో ఇమడలేని పరిస్థితులు ఉన్నాయని కొందరు లోలోపల అభిప్రాయపడుతున్నారు. ఈటలను సీనియర్ అని.. తనకు పోటీ వస్తాడని భావించి బండి సంజయ్ వర్గం పూర్తిస్తాయిలో దూరం పెడుతోందని ప్రచారం సాగుతోంది.

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు సీనియర్ కిషన్ రెడ్డి వర్గంతోపాటు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ వర్గం ఉందన్నది ఆ పార్టీ ఇన్ సైడ్ టాక్. మొదటి నుంచి ఈ రెండు వర్గాలు విడిపోయి ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు బండి సంజయ్ హవానే బీజేపీలో నడుస్తోంది. తెలంగాణలో వరుస విజయాలు, పాదయాత్రతో హైకమాండ్ దృష్టిలో బండి సంజయ్ హీరోగా మారాడు.

ఇక హుజూరాబాద్ గెలుపుతో ఈటల గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనే నేతగా ఫోకస్ అయ్యారు. పైగా బీసీ నేత కావడంతో గుర్తింపు ఉంది. నీట్ఇమేజ్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బండి సంజయ్, ఈటలలు ఇప్పుడు పోటీగా భావిస్తూ పంతాలకు పోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ తనకు పోటీగా ఈటల ఉండడాన్ని అస్సలు భరించలేకపోతున్నారని.. అందుకే దూరం పెడుతున్నారన్న టాక్ ఉంది.

ప్రస్తుతం ఈటల బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు చెప్పకుండానే బండి సంజయ్ పలువురిని ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లి బీజేపీలో చేర్పించారు. దీంతో ఈటల నొచ్చుకున్నాడని.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈటలని సస్పెండ్ చేస్తే బండి సంజయ్ వర్గం అస్సలు పట్టించుకోలేదన్న టాక్ ఉంది.

దీంతో బండి, ఈటల మధ్య ఇప్పుడు అనుకున్నంత సఖ్యత లేదని.. ఈటలను పార్టీలో ఒంటరిని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై అటు బండి కానీ.. ఇటు ఈటల కానీ బహిరంగంగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.