Begin typing your search above and press return to search.
ప్లీజ్ టెండర్లు వేయండి.. మా వల్ల కాదంటోన్న కాంట్రాక్టర్లు..!
By: Tupaki Desk | 9 Dec 2021 5:00 PM ISTఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనులకు టెండర్లు దక్కించుకోవడానికి ఒకప్పుడు కాంట్రాక్టర్లు పోటీపడేవారు. టెండర్లు జరుగుతున్నాయంటే అక్కడ భారీ ఎత్తున సందడి ఉండేది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అనుచరులు తప్ప ఎవరు టెండర్లు వెయ్యకుండా భారీ ఎత్తున రాజకీయం నడిచేది. ఎక్కువ మంది పోటీలో ఉంటే చివరకు బెదిరింపుల పర్వాలు కూడా ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఆంధ్రాలో ప్రభుత్వ టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వ పనులు అంటేనే కాంట్రాక్టర్లు మాకొద్దు బాబోయ్ అని చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు.
అసలు పోటీ సంగతి పక్కన పెడితే ... ఒక్కరంటే ఒక్కరు కూడా టెండర్ వేసేందుకు ముందుకు రావడం లేదు. ఎంత విచిత్రం అంటే రాయలసీమకు చెందిన ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లు తమకు అత్యంత సన్నిహితుడు అయిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే... వాళ్లు ఆంధ్రా లో కాంట్రాక్టు పనులు చేయటం లేదు. కర్ణాటక వెళ్లి బెంగళూరులోనో... లేదా తెలంగాణలోనో... లేదా తమిళనాడులోనో కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నారు తప్ప... ఆంధ్రాలో టెండర్ వేసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు.
దీనిని బట్టే ఆంధ్రాలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ? ఉందో తెలుస్తోంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో గత సంవత్సరం నివర్ తుఫానుకు పలు రహదారులు దెబ్బతిన్నాయి. మొత్తం 67 రహదారుల మరమ్మతులకు మార్చిలో ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. వీటిని రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులుగా విభజించి రూపొందించారు. జిల్లాలో మొత్తం 362 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని... వీటికి 86.3 కోట్ల ఖర్చు అవుతుందని నిర్ణయించారు. వీటిని మొత్తం 61 ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టారు.
ఎంత దారుణం అంటే ఈ ఏడాది ఏప్రిల్ లో మొదటిసారి టెండర్లు పిలిచారు. అరవై పనులకు టెండర్లను ఆహ్వానిస్తే ఒక్కటి మాత్రమే దాఖలైంది. రెండోసారి ముగింపు గడువు కన్నా మరికొద్ది రోజులు టెండర్ల గడువును పెంచిన మళ్లీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. ఒక్కరు కూడా టెండర్లు వేయలేదు. దీంతో చేసేది లేక మూడోసారి టెండర్లకు వెళ్లారు. ఈసారి రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి మరి ఆహ్వానించారు. అయితే ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం లేకపోవడంతో మూడోసారి కూడా ఎవరు ముందుకు రాలేదు.
దీంతో నాలుగోసారి కూడా టెండర్లను ఆహ్వానించక తప్పని పరిస్థితి. విచిత్రమేంటంటే గత ప్రభుత్వంలో ఆర్అండ్‌బీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటి వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. వీరిలో చాలా వరకు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. వారు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ చూసి కొత్త కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదని అంటున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో రోడ్లు మరింత అధ్వానంగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లోనూ ఇలాగే ఉంది.