Begin typing your search above and press return to search.

చంద్రబాబును ఇంతలా ఎవరూ తిట్టలేదేమో?

By:  Tupaki Desk   |   15 Nov 2019 12:45 PM GMT
చంద్రబాబును ఇంతలా ఎవరూ తిట్టలేదేమో?
X
ఏపీ మంత్రి కొడాలి నాని మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రజల కోసం కష్టపడుతుంటే ఓర్వలేక పవన్ కల్యాణ్ శాపనార్థాలు పెడుతున్నారని, చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ మచిలీపట్నం రోడ్డులోని ఇసుక పాయింట్‌ను పరిశీలించిన తరువాత ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, వేల కోట్ల రూపాయల ఇసుకను చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ నాయకత్వంలోని టీడీపీ నేతలు పంచభూతాలనూ మింగేశారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును ఇటీవల కాలంలో ఎవరూ తిట్టని రీతిలో తిట్టారు. గతంలో తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబును దారుణంగా తిట్టిన తరువాత ఆ స్థాయిలో తిట్టిందే కొడాలి నానీయే.

‘‘ఇసుకపోరాట దీక్ష అని చెప్పి మెడలో ఇసుక ఏసుకుని దీక్ష చేశాడు. సిగ్గూశరం లేదు. ఎందుకేసార్రా అని ఒక కార్యకర్తను అడిగితే ఎలాగూ తినలేడు కదా అందుకని బొయికలు మెడలో వేసుకోవాలని అలాగ చేశాడు అని చెప్పాడు.

చంద్రబాబు నాయుడూ.. పిచ్చవాడుగు, పిచ్చ కామెంట్లతో డయాస్ మీద అడ్డమైన వాళ్లను పెట్టి మాట్లాడొద్దు. జగన్మోహనరెడ్డి క్రిస్టియనా, హిందువా.. ఇవన్నీ మీకెందుకు. ఆయనకు మతం లేదు, కులం లేదు. జనం కోసం పనిచేస్తున్నాడు.

తిరుపతిలో సంతకం పెట్టావా అని జగన్మోహనరెడ్డిని అడుగుతున్నారు. తిరుపతి మీ అమ్మ మొ** కట్టించాడా? ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా జగన్మోహనరెడ్డికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా వెళ్లేందుకు అర్హత ఉంది.

చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ కూడా అంతే.. ఈయనేం మాట్లాడుతాడో ఆయనా వెంటనే అదే మాట్లాడుతాడు.

చంద్రబాబు సన్నాసి టైటానిక్ షిప్‌ను ముంచినట్లు పార్టీని ముంచేస్తాడని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.

ఇంగ్లిష్ మీడియం మీద ఎందుకేడుస్తారు. నీ పిల్లలు, మనవడు, పవన్ కల్యాణ్ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవడం లేదా.. అలాగే పేదల పిల్లలూ ఇంగ్లీష్ మీడియం చదవవాలని జగన్మోహనరెడ్డి తలపోస్తే మట్టి కొట్టుకుపోవాలని శాపాలు పెడతారా’’ అంటూ నాని చంద్రబాబు, పవన్‌లపై మండిపడ్డారు.

ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించింది కాదని... ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఆధారాలు చూపించమంటే పారిపోయారని, ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలని.. దీక్షలు చేసే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై తెలుగుదేశం శాసన సభ్యులు దాడి చేశారని గుర్తు చేశారు.

లోకేష్‌ కనుసన్నల్లో నడుస్తున్న బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని నాని ఆరోపణలు చేశారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇసుక మాఫియా కింగ్‌ అని ఆయన ఆరోపించారు. గ్రీన్‌ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయలు జరిమానా విధించినా చంద్రబాబుకు బుద్దిరాలేదని విమర్శించారు.

దేవినేని అవినాష్‌ వైసీపీలోకి రావడంపై ఆయన మాట్లాడుతూ.... చంద్రబాబు అవినాష్‌ను బలి పశువును చేశారని అన్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని బలి తీసుకోవడానికే గుడివాడలో పోటీ చేయించారని.. అవినాశ్ ఇప్పుడు నిజం తెలుసుకుని వైఎస్సార్‌సీపీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు.