Begin typing your search above and press return to search.
మోదీని చూసి ఎవరూ ఓట్లు వేయరట .. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 28 Aug 2020 3:00 PM GMTబీజేపీ వరుసగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి పూర్తిగా కాకపోయినా కూడా సగానికి పైగా మోడీ పాపులారిటీనే కారణం అని దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. 2014 లో ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన తరువాత అనూహ్యంగా మోడీ కి భారీగా క్రేజ్ వచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మోడీ చేసిన మంచి పనులు, మోడీ పాపులారిటీ మీదనే అధికారంలోకి వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రజలు ప్రధాని మోదీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని నమ్మే బీజేపీ నేతల సంఖ్య కూడా ఎక్కువే. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సీధార్ భగత్ మాత్రం దానికి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని చూసి ప్రజలు మనకు ఓట్లు వేయరని , 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పాపులారిటీని చూపించి బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేరని , ఎమ్మెల్యేలు పని చేస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇదివరకే మోదీ ముఖం చూసి ఓట్లు వేశారని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదని చెప్పారు. ప్రధాని మోదీని చూసిన మనకు జనం ఓట్లు వేస్తారని ఎవరైనా అనుకుంటే అది తప్పే అవుతుందని భగత్ తెలిపారు. వ్యక్తిగత పనితీరు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే భగత్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ తనదైన శైలిలో స్పందించింది. మోదీ హవా తగ్గిపోయిందనే విషయాన్ని ఒప్పుకున్న భగత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. దీనిపై తనదైన శైలిలో స్పందించిన కాంగ్రెస్.. మోదీ హవా తగ్గిందని ఒప్పుకుంటున్న బన్ సిందార్ వ్యాఖ్యలను స్వాతిస్తున్నామని, మోదీ హవా తగ్గిపోవడం వల్లే ఆయన తన ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ప్రదర్శన మెరుగుపర్చుకోమని సూచించారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ ధస్మానా అన్నారు. అయితే , 2017 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికలను బీజేపీ కేవలం మోదీ పేరుతోనే గెలిచిందని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది.