Begin typing your search above and press return to search.
అక్కడ కాంగ్రెస్ గెలుపును దేవుడూ ఆపలేడు
By: Tupaki Desk | 18 May 2019 9:13 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కావడం లేదు. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. కాంగ్రెస్ ను చావు దెబ్బ కొట్టారు. ఆ తర్వాత నాలుగు నెలలకు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మరి ఈ నాలుగు నెలల్లోనే ప్రజాతీర్పు మారుతుందా.? ప్రజలు కాంగ్రెస్ ను అమాంతం లేపుతారా.? అంటే ఫలితాల వరకూ కూడా అంచనావేయలేని పరిస్థితి.
కానీ టీఆర్ ఎస్ లో చేరడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న జగ్గారెడ్డి మాత్రం తాజాగా మళ్లీ కాంగ్రెస్ పై మనసు పారేసుకున్నారు. తాను పార్టీ మారనని కాంగ్రెస్ లోనే ఉంటానంటున్నాడు. అంతేకాదు.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఐదుగురు గెలుస్తారని.. వారిలో ముగ్గురికి కేంద్రమంత్రి పదవులు కూడా దక్కుతాయని జగ్గారెడ్డి ధీమాగా చెప్పారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ సీట్లలో గట్టిగానే తలపడ్డామని.. ఫలితాల తర్వాత టీఆర్ ఎస్ ఓటమితో కుమిలిపోవడం ఖాయమన్నారు.
పార్లమెంట్ కు కాంగ్రెస్ పార్టీ ఉద్దండులైన సీనియర్ నేతలను బరిలో దింపిందని..ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా గెలిచి టీఆర్ ఎస్ కు షాకిస్తారని చెప్పారు. తెలంగాణలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలో పోటీచేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం-రేణుకా చౌదరి, భువనగిరి-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ-ఉత్తమ్ కుమార్రెడ్డి, మల్కాజిగిరి-రేవంత్ రెడ్డిల గెలుపు ఖాయమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఐదు స్థానాల్లో టీఆర్ ఎస్ ఓడిపోతుందని స్పష్టం చేశారు.
కాగా మొన్నటి వరకు కేసీఆర్ బంధువులు పిలిచారని టీఆర్ ఎస్ లో చేరికకు రెడీ అయిన జగ్గారెడ్డి తాజాగా తాను పార్టీ మారనని ధ్రువీకరించారు. అందుకే లేటెస్ట్ గా టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడారు. ఇవి ఎన్నాళ్లో మనమూ చూద్దాం..