Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ కు సొంతిళ్లు లేదా.. నిజంగానే స్నేహితుల ఇళ్లలోనే ఉంటాడా?
By: Tupaki Desk | 20 April 2022 2:30 AM GMTప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలన్ మస్క్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటికీ తనకు సొంత ఇళ్ల లేదని టెడ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ఎలన్ మస్క్ కు సొంత ఇల్లు లేదంటే ప్రజలెవరూ నమ్మలేకుపోతున్నారు. అయితే పేపాల్ తో మొదలైన అతని వ్యాపార సామ్రాజ్యం టెస్లాతో ఊహించని స్థాయికి చేరింది. తాజాగా స్పేస్ ఎక్స్ తో భవిష్యత్తులో కూడా తనను ఎరూ టచ్ చేయలేనంత సంపదను పోగేస్తున్నాడు.
ఇటీవలే రెండు బిలియన్ డాలర్ల సొమ్ముతో ట్విట్టర్ లో మేజర్ షేర్ హోల్డర్ గా మారాడు. అంతే కాదు ఏకంగా ట్విట్టర్ సంస్థనే కొనేందుతు తాను రెడీ అంటూ ప్రకటించాడు. 43 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అలాంటి ఎలన్ మస్క్ కు సొంత ఇళ్ల లేదంటూ మరో సారి ప్రజలకు షాక్ ని ఇచ్చాడు. ఈ విషయాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు. అయినప్పటికీ ఇదే నిజం అని ఎలన్ మస్క్ వివరిస్తున్నారు.
సొంత ఇళ్లు లేని తాను స్నేహితుల ఇళ్లల్లోనే ఉంటానని టెడ్ ఇంటర్వ్యూలో మోడరేటర్ అండర్సన్ తో చెప్పాడు. అంతేకాదు టెస్లా ఇంజినీరింగ్ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు తరచుగా వెళ్తుంటానని స్పష్టం చేశారు. అలా వెళ్లిన సందర్భాల్లో తన ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండే స్పేర్ బెండ్ రూమ్ లలోనే ఉంటానని వివరించారు.
అయితే తనకు సంబంధించినంత వరకు ఖర్చులు కూడా చాలా తక్కువని పేర్కొన్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది సొంత లగ్జరీ యాచ్ లను సమకూర్చుకుంటారని.. కానీ తనకు అలాంటి ఒక్క యాచ్ కూడా లేదని ఎలన్ మస్క్ వెల్లడించారు.
తనకంటూ ఏదైనా ఖరీదైన విలువ చేసేది ఉందంటే అది ఒక్క విమానమేనని ఆయన వివరించారు. విమానం లేకపోతే తాను పనులు చేసుకోవడం కుదరదని... విమానం వల్లే సమయం ఆదా అవుతోందని.. దాని వల్ల ఎక్కువ పనులు చేసుకోగల్గుతున్నాని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ కనీసం తమకంటూ ఓ ఇల్లు ఉండాలని కోరుకుంటారు.
మిలియనీర్లు, బిలియనీర్లు అయితే అత్యంత సౌకర్యవంతమైన ఇళ్లతో పాటు దీవులను కూడా సొంతం చేసుకోవాలనకుంటారు. కానీ ఎలన్ మస్క్ అందుకు పూర్తి విరుద్ధం. తనకు సంపదనంతా ఇలాంటి వాటికి ఖర్చు చేయనని చెప్పారు. గతంలో ఆయన పేరిట ఉన్న ఇళ్లను కూడా అమ్మేశారు. లక్షల కోట్ల ఆస్తి ఉన్న ఎలన్ మస్క్ కు సొంత ఇళ్లు కూడా లేదు.