Begin typing your search above and press return to search.
వినాయకచవితి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం షాక్
By: Tupaki Desk | 17 Aug 2020 4:30 PM GMTహైదరాబాద్ లో వినాయకచవితి వేడుకలు ప్రతీఏటా అంగరంగ వైభవంగా సాగుతాయి. ముఖ్యంగా దేశంలోనే ఎత్తైన ఖైరతాబాద్ గణేషుడు.. బాలాపూర్ లడ్డూ సహా వేడుకలు తొమ్మిదిరోజుల పాటు కనివినీ ఎరుగని రీతిలో జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణ ప్రభుత్వం భక్తులకు, నిర్వాహకులకు షాకిచ్చింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ ఏడాది వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనంకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. అందరూ ఇంట్లోనే వినాయకచవితి వేడుకలు చేసుకోవాలని.. కరోనా కారణంగా బయట భారీ వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఊరేగింపులు.. లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవని ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ వినాయక ఉత్సవాలు ప్రారంభమైన నాలుగు దశాబ్ధాల్లో మొదటిసారి కరోనా కారణంతో బహిరంగ ఉత్సవాలను నిషేధించారు. అయితే ప్రభుత్వంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విభేదిస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రి తలసానిని కలిసి విన్నవిస్తామని పేర్కొన్నారు.