Begin typing your search above and press return to search.

ఓవైసీ మీటింగ్ కు అనుమతులు అక్కర్లేదా?

By:  Tupaki Desk   |   11 Nov 2019 11:02 AM IST
ఓవైసీ మీటింగ్ కు అనుమతులు అక్కర్లేదా?
X
వినేందుకు విచిత్రం గా ఉన్నప్పటికీ ఇది నిజం. చట్టం కొందరికి చట్టంగా.. మరి కొందరికి మాత్రం చుట్టంగా ఉంటుందన్న విమర్శలకు తగ్గట్లే తాజా ఉదంతం ఉంటుందని చెప్పక తప్పదు. సుదీర్ఘ కాలంగా సాగుతున్న అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు చెప్పిన వేళలో.. హైదరాబాద్ లోని పోలీసులు టపాసులు అమ్మే షాపులకు వెళ్లారు. మీరీ రెండు రోజులు టపాసులు అమ్మొద్దు. రాజకీయ పార్టీలకు అస్సలు అమ్మొద్దు. ఒకవేళ అలా అమ్మాల్సిన పరిస్థితే వస్తే.. వారి ఫోన్ నెంబర్లు మాకివ్వాలి.. వెంటనే సమాచారం ఇవ్వండంటూ పరిమితులు విధించారు.

అంతేనా.. ఆరు గంటలకు ఒకసారి.. సదరు దుకాణ దారులకు ఏవై నా రాజకీయ పార్టీలు భారీ ఎత్తున టపాసులు కొనుగోలు చేశారా? అంటూ కనుక్కోవటం కనిపించింది. అయోధ్య తీర్పు వేళ.. సంబరాలు చేసుకునేలా ఎవరైనా ప్లాన్ చేస్తే.. అలాంటివేమీ లేకుండా చేయటానికి పోలీసులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు.

టపాసులు కాల్చే విషయం లోనే ఇంత పరిమితులు విధించిన వేళ.. మజ్లిస్ అధి నేత మాత్రం భారీ ఎత్తున బహిరంగ సభను ఎలా నిర్వహించారు? తనకున్న భావ స్వేచ్ఛ పేరు తో సుప్రీం తీర్పు ను ఆయన తప్పు పట్టిన తీరు.. ఈ సందర్భం గా ఆయన వినిపించిన వాదన ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక చిన్న టపాసుల షాపు వ్యక్తి టపాసులు అమ్మే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. పాతబస్తీ లో భారీ బహిరంగ సభను నిర్వహించుకోవటానికి మజ్లిస్ అధినేత కు ఎలా అనుమతి ఇచ్చారు? అన్నది ప్రశ్న. ఈ వైరుధ్యానికి ఎవరు బాధ్యులు? మరెవరు బాధ్యత తీసుకొని సమాధానం ఇస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి.