Begin typing your search above and press return to search.
వైజాగ్ లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతుల్లేవ్..!
By: Tupaki Desk | 30 Dec 2020 11:50 AM GMTవిశాఖపట్నం నగరంలో నూతన సంవత్సర వేడుకల పై నిషేధం విధిస్తున్నట్టు సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. గత ఏడాదిగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్నిరకాల వేడుకలనూ నిషేధిస్తున్నట్టు తెలిపారు. గతంలోలాగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ఏ హోటల్ కి కూడా అనుమతులు లేవు అని స్పష్టం చేశారు. న్యూ ఇయర్‌కి పబ్లిక్ ఎంటర్టైన్ మెంట్ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. వేడుకలకు ఎలాంటి అనుమతీ లేదన్నారు. రిసార్ట్స్, పబ్ లపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. వాహనాలను ఇప్పటికే తనిఖీ చేస్తున్నామని, తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే , దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్ భయం రోజురోజుకి పెరిగిపోతుంది అని , స్ట్రెయిన్ విజృంభణ దృష్ట్యా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి దూరంగా ఉంటే మంచిది అని.. 'బయటకి వస్తే పోతాం .. ఇంట్లో ఉండి వేడుక చేసుకుందాం' అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యంగా బీచ్ రోడ్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి అనుమతులు లేవు అని స్పష్టం చేశారు.