Begin typing your search above and press return to search.
ట్రంప్-మోడీ భేటీలో వీసాల విషయం లేదట
By: Tupaki Desk | 24 Jun 2017 3:52 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటి సమావేశంపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఐటీ పరిశ్రమకు దుర్వార్త వినిపిస్తోంది. భారతీయ ఐటీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న హెచ్1 బీ వీసాల అంశాన్ని ట్రంప్ తో భేటీ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ప్రస్తావిస్తారని, తద్వారా ఆ సమస్యను పరిష్కరిస్తారని ఐటీ రంగం ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు నేతల భేటీలో హెచ్-1 బీ వీసాల అంశంపై చర్చించుకునే అవకాశం ఉండకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. వీసాల అంశాన్నిలేవనెత్తే నిర్దిష్ట ఆలోచన ఏదీ తమకు లేదని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయని అంతర్జాతీయ మీడియా జోస్యం చెప్తోంది.
హెచ్1బీ వీసాలపై తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ సమావేశంలో ఎందుకు హెచ్1బీ అంశం ఉండదో శ్వేతసౌధం అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం హెచ్-1బి వీసాల అంశాన్ని సమీక్షలో ఉందని, ఇప్పుడున్న విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని శ్వేతసౌధం అధికారి ఒకరు తెలిపారని మీడియా పేర్కొంది. ఇప్పటికిప్పుడు వీసా అప్లికేషన్లు, జారీ ప్రక్రియలో మార్పులు ఉండవని, సమీక్ష ఫలితం ఎలా ఉండబోతోందనేది ముందుగా ఊహించి చెప్పలేమని ఆయన అన్నట్లుగా మీడియా వివరిస్తోంది. ప్రస్తుతానికి ఏ దేశాన్ని టార్గెట్ చేసుకుని మార్పులు చేసే ఆలోచనలో లేవని శ్వేతసౌధం అధికారి వివరించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అగ్రనేతల చర్చల్లో హెచ్ 1బీ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తే ఆలోచన ఏదీ లేదని ఆయన వివరించారని, అయితే భారతదేశం తరఫున ప్రధానమంత్రి కనుక ఆ అంశాన్ని ప్రస్తావిస్తే దానికి సమాధానమిచ్చేందుకు అమెరికా సిద్ధమేనని ఆయన స్పష్టం చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
మరోవైపు ఈ వార్తలు ఐటీ పరిశ్రమ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ట్రంప్‌తో ప్రధానమంత్రితో ప్రథమ సమావేశంలో తమ ఇండస్ర్టీని కుదిపేస్తున్న వీసాలు - పరిశ్రమల సేవల అంశం పరిష్కారానికి నోచుకోకపోతే భవిష్యత్తులోనూ ఇబ్బందులు ఎదురవడం తప్పదని పలువురు పేర్కొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/