Begin typing your search above and press return to search.

ఫుల్ క్లారిటీ: రూ.2వేల నోటుతో నో ప్రాబ్ల‌మ్

By:  Tupaki Desk   |   5 April 2017 5:16 PM GMT
ఫుల్ క్లారిటీ: రూ.2వేల నోటుతో నో ప్రాబ్ల‌మ్
X
అవినీతి.. బ్లాక్ మార్కెట్‌.. అక్ర‌మార్కుల గుండెల్లో ద‌డ పుట్టించ‌టం.. పేరు ఏదైనా స‌రే.. పెద్ద‌నోట్ల‌ను ఒక్క సంత‌కంతో ర‌ద్దు చేసి పారేసి.. యావ‌త్ దేశాన్ని.. 130 కోట్ల మంది భార‌తీయుల్ని నిమిషాల మీద దిమ్మ తిరిగే షాకిచ్చిన ఘ‌న‌త మోడీ స‌ర్కారుదే. స‌మ‌కాలీన రాజకీయాల్లో ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తి ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా షాక్ ఇచ్చిన ఘ‌ట‌న ఏదైనా ఉందంటే ఇదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత దేశ ప్ర‌జ‌లంద‌రికి ఒక క్లారిటీ అయితే వ‌చ్చేసింద‌ని చెప్పాలి.

మోడీ ప్ర‌ధానిగా ఉన్న కాలంలో ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని దేశ ప్ర‌జ‌లంతా డిసైడ్ అయిపోయిన ప‌రిస్థితి. దీంతో వ‌చ్చే త‌ల‌నొప్పి ఏమిటంటే.. ఏ నిమిషాన ఏ పుకారు వ‌చ్చినా న‌మ్మ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. ఊ.. అంటే ఉలిక్కిప‌డిపోవాల్సి వ‌స్తోంది. ఇటీవ‌ల కాలంలో ఒక వార్త విప‌రీతంగా వినిపిస్తోంది. అదేమంటే.. త్వ‌ర‌లో రూ.2వేల నోటును ర‌ద్దు చేసేస్తార‌ని..న‌కిలీల కార‌ణంగా మోడీ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా ప్ర‌చారంలోకి వ‌చ్చేసింది.

ప్ర‌ధానిగా మోడీ ట్రాక్ రికార్డు చూసినోళ్లు ఎవ‌రైనా.. కాస్తంత లాజిక్ క‌నిపించి.. విష‌యం ఉంటే.. న‌మ్మేసే ప‌రిస్థితి. అందుకే.. రూ.2వేల నోటు ర‌ద్దు అంశం చివ‌ర‌కు పార్ల‌మెంటులో ప్ర‌శ్న రూపంలో వ‌చ్చేసింది. రూ.2వేల న‌కిలీ నోట్ల‌ను తాము సీజ్ చేస్తున్నామ‌ని.. ఈ నోటును ర‌ద్దు చేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజూ స్ప‌ష్‌టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ మ‌ధుసూద‌న్ మిస్త్రీ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన ఆయ‌న‌.. న‌కిలీల కార‌ణంగా రూ.2వేల నోటును ర‌ద్దు చేసే ఆలోచ‌న లేన‌ట్లు తేల్చేశారు.

రూ.2వేల నోటు న‌కిలీల‌ను త‌యారు చేయ‌టం అంత చిన్న ముచ్చ‌ట కాద‌ని.. నూటికి నూరుశాతం త‌యారు చేయ‌టం సాధ్యం కాద‌ని.. స్పెష‌ల్ సెక్యూరిటీ ఫీచ‌ర్స్ తో ఈ నోట్ల‌ను త‌యారు చేసిన‌ట్లు చెప్పారు. న‌కిలీ నోట్లు మార్కెట్లోకి వ‌చ్చాయ‌ని.. ఆ పేప‌ర్ క్వాలిటీ అస్స‌లు బాగోద‌ని.. ఇట్టే గుర్తించేయొచ్చ‌న్నారు. నకిలీ నోట్లు ఎక్కువ‌గా స‌ర్క్యులేట్ అవుతున్న స్టేట్స్ ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు కిర‌ణ్ చెప్పిన స‌మాధానం కాస్తంత ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని చెప్పాలి. నకిలీలు ఎక్కువ‌గా మోడీ సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌.. ప‌శ్చిమ‌బెంగాల్ లో ప‌ట్టుకుంటున్న‌ట్లు చెప్పారు. న‌కిలీ నోట్ల త‌యారీదారుల‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతుందంటూ అల‌వాటులో భాగ‌మైన ఆన్స‌ర్ ఇచ్చేశారు మంత్రివ‌ర్యులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/