Begin typing your search above and press return to search.

బార్బీ రూపం ఒరిజినలే.. సర్జరీ కాదట

By:  Tupaki Desk   |   4 July 2016 8:11 AM GMT
బార్బీ రూపం ఒరిజినలే.. సర్జరీ కాదట
X
ముద్దులొలికే బార్బీ బొమ్మ అంటే నచ్చనిదెవరికి... అలాంటిది, ఏకంగా అమ్మాయే బార్బీ బొమ్మలా ఉంటే.. ఉంటే ఏంటి అచ్చు గుద్దినట్లు బార్బీడాల్ లాంటి అమ్మాయి వలేరియా ల్యుకనోవా గురించి ఇప్పటికే ప్రపంచానికి తెలుసు. అయితే.. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అలా మారిందని అంతా అనుకుంటున్నారు. కానీ... అదేమీ కాదని ఈ హ్యూమన్ బార్బీ చెబుతోంది. ఉక్రెయిన్ లో నివసించే ల్యుకనోవా అక్కడ సింగర్ గా, మోడల్ గా బాగా పాపులర్. అయితే, బార్బీ డాల్ గా పాపులర్ అయిన తరువాత ఆమెను అంతా ఇప్పుడు హ్యూమన్ బార్బీ అంటుండడంతో ఆమె తానేమీ బొమ్మను కానని చెబుతోంది. అంతేకాదు.. తాను సర్జరీ చేయించుకుని ఇలా తయారయ్యానని అంతా అనుకుంటున్నారని.. కానీ... తనకు 14 ఏళ్ళు వచ్చినప్పటినుంచి ఇలాగే ఉన్నా.. నేనేమీ సర్జరీలు చేయించుకుని మారలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

తానేమీ చిన్నపిల్లను కానని.. తనకు 30 ఏళ్ల వయసని.. తనను బొమ్మతో పోల్చడం మానుకోవాలని ఆమె కోరుతోంది. అందమైన అమ్మాయిగా కనిపించేందుకు కనీసం గంటన్నర సేపు కష్టపడే తనకు ఇలా బొమ్మ అని పిలిపించుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని చెబుతోంది. మొదటినుంచి తాను ఇలాగే ఉన్నానని.. సర్జరీలు చేసి ఇలా ఏమీ మారలేదని.. ఇకనైనా తనను బొమ్మతో పోల్చడం మానుకోవాలని ఆమె ప్రపంచాన్ని కోరింది.

అయితే.. తన రూపానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ కారణం కాదంటున్న ల్యుకనోవా భవిష్యత్తులో తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ఉందని చెబుతోంది. సర్జరీకి తనేమీ వ్యతిరేకం కాదంటోంది. అయితే... అందరూ బొమ్మ అంటుండడంతో చికాకు పడుతున్న ఆమె తన రూపాన్ని బొమ్మ పోలికలు లేకుండా మార్చుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా ఉక్రెయిన్ అమ్మాయి ఇలా బొమ్మలా ఉందని మూడేళ్ల కిందట తొలిసారి బయటపడింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె చిత్రాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.