Begin typing your search above and press return to search.
గౌరీలంకేష్ హత్యకేసులో సాధ్వీకి క్లీన్ చిట్
By: Tupaki Desk | 9 May 2019 11:08 AM GMTసాధ్వీ ప్రగ్యా సింగ్.. భోపాల్ నుంచి పోటీచేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఈమెకు పోటీగా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీచేస్తున్నారు. అయితే ఇదే సాధ్వీ.. ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేష్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మైనార్టీలపై బాంబు దాడుల కేసులోనూ 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వచ్చింది సాధ్వీ.. ఇంతటి నేర చరిత్ర ఉన్న సాధ్వీకి బీజేపీ టికెట్ ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ సహా చాలా మంది గొంతెత్తి విమర్శించారు. అయినా ఆమె తీరు మారలేదు.
తాజాగా బీజేపీ ఆమెకు మరో భారీ ఊరట కల్పించినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండడం.. వ్యవస్థలన్నీ చెప్పుచేతల్లో ఉండడంతో కర్ణాటకలో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసు నుంచి సాధ్వీకి తాజాగా ఉపశమనం కల్పించినట్టు కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.
గౌరీలంకేష్ హత్య కేసుకు సంబంధించిన వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా సాధ్వీ ప్రగ్యాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సంచలన క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమే ప్రమేయమున్నట్లు విచారణలో తాము ఎక్కడా గుర్తించలేదని గురువారం ప్రకటనలో స్పష్టం చేశారు. కోర్టుకు సమర్పించిన పత్రాలలో కూడా ఆమె ప్రమేయం ఏమీ లేదని.. ఆధారాలు లభించలేదని ఆమెను కేసునుంచి విముక్తి కల్పించాలని సిట్ పేర్కొంది.
2017 సెప్టెంబర్ 5 మతచాందసవాదులు, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన గౌరీలంకేష్ ను బెంగళూరులోని ఆమె స్వగృహంలో కొందరు తుపాకీతో కాల్చి అతిదారుణంగా చంపారు. ఆ కేసులో ప్రగ్యా సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నికల వేళ.. బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆమెకు సిట్ కేసు నుంచి తప్పించడం వివాదాస్పదమైంది.