Begin typing your search above and press return to search.
కొత్త 2వేల నోట్ల రద్దు చేయరట
By: Tupaki Desk | 17 March 2017 5:17 PM GMTపెద్ద నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ముద్రించిన రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించే ప్రతిపాదన ఉందంటూ సాగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ అంశాన్ని వెల్లడించారు. రూ.2వేల నోటు రద్దు కానుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జైట్లీ స్పష్టం చేశారు.
నల్లధనం, అవినీతి, నకిలీ నోట్ల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతోనే పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు జైట్లీ చెప్పారు. "గత ఏడాది నవంబర్ 8వ తేదీన రూ.500, వెయ్యి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసిన తర్వాత ఆర్బీఐ కొత్త రెండు వేల నోట్లను ముద్రించింది. రూ.2వేల నోట్లతో పాటు కొత్తగా రూ.500 నోట్లను కూడా ముద్రించారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 12.44 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లు ఆర్బీఐ చెస్ట్‌లోకి వచ్చింది"అని జైట్లీ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీ వరకు సుమారు 12 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. జనవరి 27 వరకు సుమారు 9.921 లక్షల కోట్లు చెలమణిలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇదిలాఉండగా.. కేంద్ర ప్రభత్వం రూ.10 ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్లాస్టిక్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్ నిర్వహించాలని ఆర్బీఐని ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ అంశంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానం ఇచ్చారు. దేశంలో మొత్తం అయిదు చోట్ల ప్లాస్టిక్ పది రూపాయల నోట్లతో ఫీల్డ్ ట్రయల్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాటన్ నోట్ల కన్నా ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి సభలో గుర్తు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/