Begin typing your search above and press return to search.
లోగో తీసేయమని ఆ క్రికెటర్ అడగలేదట
By: Tupaki Desk | 6 April 2021 4:30 PM GMTఐపీఎల్ సీజన్ దగ్గరకు వచ్చేసింది. అన్ని జట్లు ఆట మీద ఫోకస్ పెడుతున్నాయి. ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో వివిధ ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని అంశాలు వార్తలుగా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే ఖరీదైన ఆటగాడు మొయిన్ అలీకి సంబంధించిన ఒక అంశం వార్తగా మారింది. ఐపీఎల్ వేలంలో రూ.7 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకున్న మొయిన్ అలీ.. తాను ధరించే జెర్సీ మీద నుంచి ఒక మద్యం లోగోను తీసేయాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అతడి విన్నపానికి చెన్నై సూపర్ కింగ్స్ సైతం అంగీకరించినట్లుగా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది.
అయితే.. ఇవన్నీఉత్త పుకార్లే తప్పించి.. అసలు అలాంటిదేమీ లేదన్న మాట ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది. తన జెర్సీ పై నుంచి మద్యం కంపెనీకి చెందిన లోగో తీయాలని మొయిన్ అలీ కోరలేదని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది. అవన్నీ ఉత్త పుకార్లేనని.. అలీ అలా ఎప్పుడూ అడగలేదని.. చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన యూసఫ్ పఠాన్ తన జెర్సీ మీద ఉన్న కింగ్ ఫిషర్ లోగోపై టేప్ అంటించుకొని మరీ మైదానంలోకి దిగటం అప్పట్లో చర్చకు తావిచ్చింది. తాజాగా మొయిన్ అలీ మీద ఈ తరహా వార్తలు రావటం.. ఆ జట్టు క్లారిటీ ఇచ్చింది. మరీ.. మైదానంలో దిగే వేళలో.. మొయిన్ అలీ జెర్సీ మీద సదరు మద్యం లోగో ఉంటుందా? లేదా? అన్నది తేలనుంది.