Begin typing your search above and press return to search.

ఏమి షా.. ఒక్క‌డు స‌రైనోడు దొర‌క‌లేదా?

By:  Tupaki Desk   |   11 Oct 2018 4:42 AM GMT
ఏమి షా.. ఒక్క‌డు స‌రైనోడు దొర‌క‌లేదా?
X
ఎన్నో ఆశ‌లు.. మ‌రెన్నో ఆకాంక్ష‌లు మ‌న‌సులో ఉన్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ వాటికి కార్య‌రూపం దాల్చ‌క‌.. తెలంగాణ‌లో ప్ర‌బ‌ల రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల‌న్న కోరిక ఎప్ప‌టికి కుద‌ర‌దా? అన్న క్వ‌శ్చ‌న్ క‌మ‌ల‌నాథుల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇలాంటి వేళ‌.. అరే భ‌య్‌.. నేను చెప్పిన‌ట్లు చేస్తే మీకు గెలుపు ప‌క్కా అంటూ అమిత్ షా ఉత్సాహ‌పు మాట‌ల‌కు క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ అన్నంత‌నే.. గుర్తుకొచ్చే గుప్పెడు బీజేపీ నేత‌లు మిన‌హా ఆ పార్టీ ఎదుగు బొదుగు లేన‌ట్లున్న ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు సీన్లోకి వ‌చ్చారు అమిత్ షా. ఇలాంట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి? కేసీఆర్ లాంటి అధినేత‌ను ఎదుర్కొనాలంటే సిన్న విష‌య‌మా? ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి?

మ‌న‌సులో కాంక్ష ఉంటే స‌రిపోదు.. అది చేత‌ల్లో క‌నిపించిన‌ప్పుడే అనుకున్న ప‌ని పూర్తి అవుతుంది. తెలంగాణ‌లో తాము నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మారాల‌ని.. కేసీఆర్ కు తాము ఆప్ష‌న్ అయ్యేంత‌గా బ‌ల‌ప‌డాల‌ని త‌పిస్తున్న అమిత్ షా లాంటోళ్లు.. బేసిక్ విష‌యాల మీద ఫోకస్ చేయ‌క‌పోతే జ‌రిగే న‌ష్ట‌మెంత‌? అన్న‌ది తాజాగా జ‌రిగిన క‌రీంన‌గ‌ర్ బ‌హిరంగ స‌భ‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఈ స‌భ కోసం రెండు వారాల నుంచి భారీ స్కెచ్ వేసి.. ప‌లువురు బీజేపీ ముఖ్య‌నేత‌ల్ని క‌రీంన‌గ‌ర్ లో మ‌కాం వేయించిన పార్టీ నాయ‌క‌త్వం.. అస‌లు విష‌యాన్ని మ‌ర్చిపోయింది. ఏర్పాట్లు ఎంత ఘ‌నంగా ఉన్నా.. స‌భలో తాను మాట్లాడే మాట‌లే స‌భ స‌క్సెస్ అయ్యిందా? లేదా? అన్న‌ది తేలుస్తుంద‌న్న చిన్న విష‌యాన్ని అమిత్ షా ఎలా మిస్ అయ్యారో ఒక ప‌ట్టాన అర్థం కానిది.

షా బ‌హిరంగ స‌భ నేప‌థ్యంలో.. తాను చెప్పే మాట‌ల స్క్రిప్ట్ ను త‌యారు చేసే వారెంత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కానీ..అలాంటిదేమీ షా స్పీచ్ లో క‌నిపించ‌లేద‌ని మ‌ర్చిపోకూడ‌దు. త‌న‌ప్ర‌సంగ పాఠాన్ని సిద్ధం చేసినోళ్ల‌ను ఎంపిక‌లో దొర్లిన పొర‌పాటు ఒక ఎత్తు అయితే.. అమిత్ షా చెప్పే మాట‌ల్ని అనువాదం చేసేందుకు ఎంపిక చేసినోడి స‌త్తా మ‌రీ ఇంత చిన్న‌గా ఉంటుందా? అన్న ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌తి విష‌యంలోనూ ప‌క్కా ప్లానింగ్ తో న‌డుస్తార‌ని షాకు పేరుంది. అలాంట‌ప్పుడు తానేం మాట్లాడాల‌న్న విష‌యాన్ని రాసిచ్చేటోడ్ని.. త‌న మాట‌ల్ని ప‌వ‌ర్ ఫుల్ గా అనువాదం చేసి చెప్పేటోడ్ని ఎంపిక చేసుకోవ‌టంలో షా ఎలా ఫెయిల్ అయ్యార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు లోపాల కార‌ణంగానే క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో అంత పెద్ద షా మాట్లాడుతుంటే.. జ‌నాలు ఊర్రూత‌లూగిపోలేదు. క‌నీసం.. ఆయ‌న మాట‌ల‌కు ప‌ర‌వ‌శించి పోయిన‌ట్లు కూడా క‌నిపించ‌లేదు. ఇంత‌కు మించిన వైఫ‌ల్యం ఇంకేం కావాలి?