Begin typing your search above and press return to search.
లోకేశ్ పిలుపును లైట్ గా తీసుకున్నారు
By: Tupaki Desk | 24 Sep 2016 7:18 AM GMTఏపీలో రాజకీయం శ్రుతి మించుతోంది.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసే హక్కు - రాజకీయ పార్టీని నడిపించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ తమ ప్రత్యర్థి పార్టీల నేతలను కనుమరుగు చేయాలని ప్రయత్నించడం ఇటీవల ఎక్కువైంది. విపక్ష నేతలను బహిష్కరించాలంటూ పాలక పక్షంలోని కీలక నేతలే స్వయంగా పిలుపు ఇస్తుండడంతో రాజకీయ అక్కసు మరీ మితిమీరుతోందని అర్థమవుతోంది. తాజాగా ఏపీ సీఎం తనయుడు - టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేశ్ .. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నేత జగన్ ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ప్రారంభించారు. అయితే... ప్రజలు మాత్రం ఆ ధోరణిని, అలాంటి అసూయను ఏమాత్రం ఆమోదించలేదు. లోకేశ్ పిలుపు పిలుపుగానే మిగిలిపోయింది తప్ప ఎవరూ స్పందించలేదు.
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జగన్ ఏలూరులో నిర్వహించిన యువభేరి నేపథ్యంలో లోకేశ్ ట్విట్టర్ లో ఆయనకు వ్యతిరేకంగా ఎక్స్ పెల్ జగన్ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ ప్రారంభించారు. అవినీతి ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ కాలేజి విద్యార్థులకు నీతులేం చెబతారంటూ ఆయన ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు... జగన్ అక్రమాస్తులు అంటూ 1.37 నిమిషాల నిడివిగల వీడియోనూ టీడీపీ ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు.
లోకేశ్ పిలుపుకు కానీ... వీడియోలకు కానీ ట్విట్టర్ జనం పెద్దగా రెస్పాండ్ కాలేదు. మామూలుగా అయితే లైక్ లు - షేర్లు - రీట్వీట్లతో హుషారెత్తించే జనం లోకేశ్ పిలుపుకు మాత్రం ఏమాత్రం రెస్పాండు కాలేదు. కనీసం వంద మంది కూడా స్పందించకపోవడంతో లోకేశ్ కు సోషల్ మీడియాలో ఆదరన లేదా... లేదంటే జగన్ ను బహిష్కరించాలనడం మరీ ఎక్కువని ఫీలవడం వల్ల కూడా అలా జరిగిందంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/