Begin typing your search above and press return to search.

మ‌న క్రికెట‌ర్లకు ఆర్నెళ్లుగా జీతాలు లేవు!

By:  Tupaki Desk   |   28 April 2017 1:40 PM GMT
మ‌న క్రికెట‌ర్లకు ఆర్నెళ్లుగా జీతాలు లేవు!
X
భార‌తీయ క్రికెట‌ర్ల చిత్ర‌మైన స‌మ‌స్య ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఈ సీజ‌న్‌ లో తిరుగులేని స‌క్సెస్ సాధించింది. ఆడిన ప్ర‌తి టెస్ట్ సిరీస్‌ నూ గెలుచుకుంది. న్యూజిలాండ్‌ తో మొద‌లుపెడితే ఆస్ట్రేలియా వ‌ర‌కు విజ‌య ప‌రంప‌రం కొన‌సాగించింది. దీంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన బీసీసీఐ కోహ్లి సేన‌కు న‌జ‌రానాలు కూడా ప్ర‌క‌టించింది. తీరా చూస్తే ఆర్నెళ్లుగా అస‌లు మ్యాచ్ ఫీజే అంద‌లేదు. ఆదాయ పంపిణీలో ప్ర‌స్తుతం బీసీసీఐకి - ఐసీసీకి మ‌ధ్య న‌డుస్తున్న వార్ కూడా దీనికి ఓ కార‌ణమ‌ని తెలుస్తోంది.

కొత్త ప్లేయ‌ర్స్ కాంట్రాక్ట్ ప్ర‌కారం.. ఓ ప్లేయ‌ర్ టెస్ట్ ఆడితే రూ.15 ల‌క్ష‌లు - వ‌న్డేకు రూ.6 ల‌క్ష‌లు - టీ20కి రూ.3 ల‌క్ష‌లు ఇవ్వాల్సి ఉంటుంది. `టెస్ట్ ఆడిన త‌ర్వాత 15 నుంచి నెల రోజుల్లో మ్యాచ్ ఫీజులు చెల్లించేస్తారు. కానీ ఈసారి మాత్రం చాలా ఆల‌స్య‌మైంది. కార‌ణ‌మేంటో తెలియ‌దు`` అని టీమ్‌లో రెగ్యుల‌ర్‌ గా స్థానం సంపాదించే ఓ క్రికెట‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు మ‌హిళ‌ల జ‌ట్టుకు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాపై గెలిచినందుకు బోర్డు ప్ర‌క‌టించిన న‌జ‌రానాలు కూడా ఇంకా ప్లేయ‌ర్స్‌ కు అంద‌లేదు. దీని కింద ఒక్కో ప్లేయ‌ర్‌ కు రూ.కోటి అందాల్సి ఉంది. సుప్రీంకోర్టు నియ‌మించిన క‌మిటీ ప్ర‌స్తుతం బోర్డు ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటోంది. వాళ్ల అనుమ‌తి లేనిదే ఒక్క రూపాయి కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం లేదు. ఇలా చాలా కార‌ణాలు ప్లేయ‌ర్స్‌ కు జీతాలు చెల్లించ‌డాన్ని ఆల‌స్యం చేస్తున్నాయ‌ని ఓ బోర్డు అధికారి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/