Begin typing your search above and press return to search.
కేసీఆర్ కలల హామీ యూటర్న్ తీసుకుంది
By: Tupaki Desk | 5 March 2018 1:20 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన భారీ ప్రకటనను వెనక్కు తీసుకున్నారు. అట్టహాసంగా చేసిన ప్రకటన నుంచి ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. రైతన్నల సంక్షేమానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని - 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు - నాయకులు ఊదరగొట్టారు. అయితే ఈ ప్రకటన ఆదిలోనే వెనక్కుపోయింది. అన్నదాతల కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. రాజ్యాంగ నిబంధనలు - అసెంబ్లీ నియమావళి శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ పెట్టడాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
2018-19 రాష్ట్ర బడ్జెట్ తో పాటు - వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు టి.హరీశ్ రావు - పోచారం శ్రీనివాసరెడ్డి - ఈటల రాజెందర్ - మహేందర్ రెడ్డి - తుమ్మల నాగేశ్వర్ రావు - ఉభయ సభల్లో చీఫ్ విప్ లు - అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక బడ్జెట్ రద్దు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ సారి బడ్జెట్లో వ్యవసాయదారుల కోసం మరిన్ని కార్యక్రమాలు - పథకాల కోసం నిధులు కేటాయిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనికి గల సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చ జరిగింది. మొత్తం ప్రభుత్వానికి ఒకే బడ్జెట్ ఉండాలని, శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్లు ప్రవేశ పెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు.
అసెంబ్లీ నియమావళిలోని రూల్ నెంబరు 150 ప్రకారం ఆదాయ - వ్యయాలు మాత్రమే బడ్జెట్ కిందికి వస్తాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. ఇతరత్రా ప్రణాళికలు - వివరణలన్నీ పద్దుల కిందకే వస్తాయి కానీ, ప్రత్యేక బడ్జెట్ కింద పరిగణించడానికి వీలు లేదని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకసారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు వివాదాస్పదమైంది. కేంద్రంలో కూడా రైల్వే బడ్జెట్ ను ప్రధాన బడ్జెట్లోనే కలిపి ప్రవేశ పెడుతున్న విషయాన్ని సీఎంకు వివరించారు. దీంతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు సీఎం ప్రకటించారు. బడ్జెట్లోనే వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, ప్రవేశ పెడుతున్న పథకాలను - వెచ్చిస్తున్న నిధులను వివరించాలని సీఎం చెప్పారు. తద్వారా తమ నిర్ణయం వివాదాస్పదం కాకుండా చూసే ప్రయత్నం చేశారు.