Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు సెక్సుకు ఆ దేశంలో నో.. కొత్త చట్టానికి సిద్ధమైన కంట్రీ

By:  Tupaki Desk   |   3 Dec 2022 4:08 AM GMT
పెళ్లికి ముందు సెక్సుకు ఆ దేశంలో నో.. కొత్త చట్టానికి సిద్ధమైన కంట్రీ
X
ఆసియా దేశాల్లో అత్యధిక ముస్లింలు కలిగి ఉన్న దేశంగా ఇండోనేషియాకు పేరుంది. మిగిలిన ముస్లిం దేశాల మాదిరి కాకుండా.. ఈ దేశం కాస్తంత భిన్నత్వంతో కూడుకున్నది. ఇక్కడి నేచర్.. ప్రజల తీరు కారణంగా టూరిజం పెద్ద ఎత్తున డెవలప్ అవుతోంది. పేరుకు పేద దేశంగా పలువురు అభివర్ణించినా.. అలాంటిదేమీ లేదన్న మాట చెబుతుంటారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉండే దేశంగా ఇండోనేషియాకు పేరుంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ దేశంలోని మహిళల పేర్లలో చాలా వరకు హిందూ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. పేరుకు ముస్లింలే అయినప్పటికీ.. తమ తాత ముత్తాతల నుంచి వచ్చే పేర్లను కంటిన్యూ చేసేందుకు వీరు ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరి పేర్లను చూస్తే.. వందల ఏళ్ల క్రితం వీరంతా హిందువులే అన్న భావన కలుగక మానదు. దీనికి తోడు ఆ దేశంలో ఉండే పెద్ద ఎత్తున టెంపుల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆ దేశంలో కొత్త చట్టం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు లేని విధంగా కొత్త చట్టంలోని అంశాలు ఉండనున్నాయి. ఇకపై.. పెళ్లికి ముందు రొమాన్సు.. సెక్సుతో పాటు సహజీవనాన్ని నిషేధించేందుకు ఆ దేశం సిద్ధమైంది. ఒకవేళ తాము తీసుకొచ్చిన నిబంధనను ఉల్లంఘిస్తే ఏడాది పాటు జైలు.. లేదంటే భారీ జరిమానాను విధించాలని నిర్ణయించారు. ఈ దిశగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన క్రిమినల్ కోడ్ ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పెళ్లికి ముందు సెక్సు చేయటం.. సహజీవనం చేయటం నిషేధం. ఒకవేళ భర్త లేని వారు.. భార్య లేని వారు ఎవరితోనైనా సెక్సు చేస్తే ఆ చర్యను వ్యభిచారం కింద శిక్షిస్తారని స్పష్టం చేస్తుననారు. కేటగిరి 2 కింద గరిష్ఠంగా ఏడాది పాటు జైలు ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ చట్టం ఇండోనేషియా ప్రజలు మాత్రమే కాదు విదేశీయులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నారు. ఇండోనేషియా విలువలకు తగ్గట్లుగా కొత్త చట్టం ఉంటుందని చెబుతున్నారు.

మన దేశంతో పాటు వేర్వేరు దేశాల నుంచి టూరిజంలో భాగంగా పెద్ద ఎత్తున విదేశీయులు ఆ దేశానికి వెళతారు. అలాంటి వేళ.. ఈ కొత్త చట్టం గురించి అవగాహన లేని పక్షంలో ఇబ్బందుల్లో ఇరుక్కోవటంతో పాటు.. కేసుల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంలో మహిళలు.. మతపరమైన మైనార్టీలు.. స్వలింగ సంపర్కం మీద ఎన్నో ఆంక్షల్ని విధిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివేళ.. తాజాగా తెస్తున్న చట్టం కొత్త పరిమితులకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.