Begin typing your search above and press return to search.
శృంగారం లేకుంటే పెళ్లి చెల్లుబాటు కానట్లే!
By: Tupaki Desk | 1 May 2018 4:45 AM GMTఆలుమగల మధ్య అనుబంధానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఆసక్తికరంగా మారింది. దంపతుల మధ్య సహజసిద్ధంగా ఉండాల్సిన శృంగారం లేనప్పుడు వారి వివాహం రద్దు చేయొచ్చంటూ ముంబయి హైకోర్టు తేల్చింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెంది దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది.
ఖాళీ పత్రాలపై సంతకం చేయించటం ద్వారా తనను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని మహిళ ఒకరు ఫిర్యాదు చేసి.. తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళ.. ఖాళీ పత్రాలపై సంతకం చేసిందంటే నమ్మలేనని.. మోసం జరిగిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవని కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మృదులా భట్కర్ స్పష్టం చేశారు.
సదరు మహిళ విడాకులు కావాలంటే.. ఆ వ్యక్తి మాత్రం తమ వివాహ బంధం కొనసాగాలని కోరారు. అయితే.. వివాహం ముఖ్య లక్ష్యాల్లో దంపతుల మధ్య సహజసిద్ధంగా ఉండాల్సిన శృంగార సంబంధం ఉండాలని.. అలాంటిదేమీ లేనప్పుడు వివాహ దెబ్బ తిన్నట్లేనని.. సదరు కేసులో దంపతులు ఇద్దరూ ఒక్కరోజు కూడా కలిసి లేరని పేర్కొంది.
అయితే.. తమ ఇద్దరి మధ్య శృంగార సంబంధం ఉందని భర్త వాదించినప్పటికీ.. అందుకు సరిపడా ఆధారాల్ని చూపించటంలో విఫలమయ్యారు. దీంతో.. వారి మధ్య శృంగారబంధం ఉందన్న విషయాన్ని నిరూపించలేకపోవటంతో వారికి విడాకుల్ని కోర్టు మంజూరు చేసింది. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తన భార్య గర్భం దాల్చినట్లుగా భర్త పేర్కొన్నా.. అలాంటిదేమీ లేదంటూ గైనకాలజిస్ట్ చేసిన పరీక్ష తేల్చటంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.