Begin typing your search above and press return to search.
పుకార్లే; న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో కాల్పులు
By: Tupaki Desk | 15 Aug 2016 7:14 AM GMTఅదిగో తోక అంటే ఇదిగో పులి అనేవాళ్లు ఈ మధ్యన ఎక్కువైపోయారు. ఒకరి హడావుడి ప్రపంచానికే పెద్ద ఉలికిపాటుకు గురి అవుతున్న పరిస్థితి. టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన వేళ.. సమాచారం ఏదైనా సరే.. చిన్న తేడాతో బయటకు వస్తే చాలు.. అది నిమిషాల వ్యవధిలో ప్రపంచంలోని ఆ మూల నుంచి ఈ మూల వరకూ పాకిపోయే పరిస్థితి. తాజాగా అలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.
ప్రఖ్యాత జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పుల కలకలం రేగిందన్న వార్తలు ఒక్కసారి ఉలికిపాటుకుగురి చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదుల పంజాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవేళ.. తాజాగా అమెరికా బలైందా? అన్న సందేహం కలిగిన పరిస్థితి. అయితే.. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తాజాగా తేలిపోయింది. ఇద్దరు ప్రయాణికులకు కాల్పుల శబ్దం వినిపించిందన్న మాటతో ఓ రేంజ్ హడావుడి నెలకొంది.
ఇద్దరు ప్రయాణికులు తమకు తుపాకుల కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగా అధికారులకు చెప్పటం.. దీంతో అలెర్ట్ అయిన వారు.. విమానాల్ని నిలిపివేయటం.. ఎయిర్ పోర్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించటం చేశారు. ఇదిలా ఉంటే.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఘటనపై హాఫ్ నాలెడ్జ్ తో చేసిన ట్వీట్లు మరింత గందరగోళానికి గురి చేశాయి. ఈ ట్వీట్ల ఆధారంగా కొన్ని మీడియా సంస్థలు క్రాస్ చెక్ చేసుకోకుండా వార్తలు రాసేయటంతో మరింత రచ్చ అయ్యింది. అయితే.. ప్రధాన మీడియా సంస్థలైన బీబీసీ.. సీఎన్ఎన్.. న్యూయార్క్ టైమ్స్ లాంటివేమీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. కాకుంటే.. సీఎన్ఎన్ మాత్రం జరిగిన తప్పును వివరిస్తూ వార్తఇవ్వటంతో అసలేం జరిగిందో ప్రపంచానికి అర్థమైన పరిస్థితి. ఒకరి హడావుడి.. మొత్తం ప్రపంచానికే చెమటలు పట్టేలా చేస్తుందంటే ఇదేనేమో.