Begin typing your search above and press return to search.
స్టార్లూ లేరు...సార్లూ లేరు..
By: Tupaki Desk | 12 Nov 2018 5:48 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు మహాకూటమిలో భాగస్వామ్యా పార్టీలైన కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సీపీఐ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతీ ఎన్నికలలోను ప్రచారం కోసం వచ్చే సినిమా స్టార్లు ఈ ఎన్నికలలో మాత్రం ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ కమిటీ చైర్ పర్సన్ గా ప్రముఖ నటి విజయశాంతిని నియమించింది. ఈ నియామకం జరిగి నెల రోజులు పైనే అయింది. అయినా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సినీ రంగానికి చెందిన స్టార్లు ఎవరూ ముందుకు రాలేదు. గత ఎన్నికలలో కాని, అంతకు ముందు ఎన్నికలలో కాని స్టార్ క్యాంపేయిన్ తో తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లేవి. ప్రతీ రాజకీయ పార్టీ ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండే సినీ ప్రముఖులతో ప్రచారాన్ని హోరేత్తించేవి. అయితే ఈ సారి మాత్రం ఆ హోరు జోరు ఎక్కడా కానరావటం లేదు. ప్రతీ పార్టీకి సినీ నటుల నుంచి అంతో ఇంతో పరిచయం ఉంది. అయితే ఆ పరిచయాలు మాత్రం ప్రచారానికి పనికి రావటం లేదు.
కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నటి విజయశాంతి - ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వంటివారున్నారు. వీరికి ఉన్న పరిచయాలు - సినీ పరిశ్రమలోని స్నేహితులతో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇందుకోసమే ప్రముఖ నటి విజయశాంతికి స్టార్ క్యాంపేయిన్ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్దాయిలో ప్రయోజనమేమి కనపడడం లేదు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దగా ఎవరూ మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ముందుకు రావటం లేదు. ఇదీ ఆ పార్టీని ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి కారణం తెలంగాణలో ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు వస్తాయని - వేరొక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే తెలంగాణలో ఇబ్బందులు వస్తాయని సినీ ప్రముఖులు భావిస్తున్నారని సమాచారం. ఈ భయాలతోనే తెలంగాణ ముందస్తు ఎన్నికలలో సినిమా స్టార్లు గాని - పేజ్ 3 పీపుల్ గాని ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని అంటున్నారు. ఎన్నికలంటే స్టార్ల ప్రచారంతో రంజుగా ఉంటుందని ఆశించిన ఓటర్లకు - మీడియాకు అలాంటి వాతవరణం కనిపించకపోవడంతో నిరాశే కలిగిస్తోంది.