Begin typing your search above and press return to search.

ఆన్ లైన్లో ఇసుక 'నో స్టాక్'!

By:  Tupaki Desk   |   10 Oct 2019 2:30 PM GMT
ఆన్ లైన్లో ఇసుక నో స్టాక్!
X
ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రయోగం పట్ల విముఖత వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పటికే ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం విమర్శలు చేస్తూ ఉంది. ఇసుక రవాణాలో అక్రమాలను నివారించడానికి చర్యలు చేపట్టడంతో కొరత ఏర్పడింది. దీంతో నిర్మాణ రంగ పనుల్లో ఉండే కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని తెలుగుదేశం అంటోంది. అందుకు తగ్గట్టుగా కొంతమంది కార్మికుల వాయిస్ ను పట్టుకుని మీడియా కూడా హైలెట్ చేస్తూ ఉంది.

ఈ నేపథ్యంలో నూతన ఇసుక విధానాన్ని మొదలుపెట్టారు. అన్ని రీచ్ లూ తెరవాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆన్ లైన్ లో ఇసుక ను రిజర్వ్ చేసుకునే అమ్మకాలు కూడా మొదలయ్యాయి. అయితే ఆన్ లైన్ లో ఇసుకను బుక్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందే ఎదురవుతోందట.

ఆన్ లైన్ లో ‘నో స్టాక్’ బోర్డు దర్శనం ఇస్తూ ఉందట. ఇసుక కోసం ఆన్ లైన్ సేవ అందుబాటులో అని ప్రభుత్వం ప్రకటించగా - తీరా ఆన్ లైన్ లో ప్రయత్నిస్తే మాత్రం నో స్టాక్ బోర్డే ఎదురవుతూ ఉండటంతో కొనుగోలు చేయాలనుకునే వారు అసహనానికి లోనవుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా నో స్టాక్ బోర్డే ఉండటంతో.. వారిలో అసహనం పెల్లుబుకుతోంది. నో స్టాక్ పెట్టేందుకు ఈ విధానం ఎందుకని నిరాశ పడ్డ వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.