Begin typing your search above and press return to search.
ఏపీలో స్ట్రెయిన్ వైరస్ .. కీలక ప్రకటన చేసిన మంత్రి ఆళ్ల నాని !
By: Tupaki Desk | 24 Dec 2020 12:05 PM GMTకొత్త కరోనా వైరస్ స్ట్రైయిన్, సెకండ్ వేవ్ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బ్రిటన్ లో కరోనా కొత్త రకం వైరస్ విజృంభణతో విమాన ప్రయాణికుల రాకపోకలపై పూర్తి దృష్టి
పెట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్ టీపీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు.. ఎయిర్‌పోర్టుల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కరోనా కొత్త స్ట్రైయిన్‌పై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని స్పందించారు. ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవని ఆళ్ల నాని తెలిపారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అయినా ఆమె నార్మల్ గా ఉన్నారన్నారు. ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్ వచ్చిందని.. ఫస్ట్ క్లాస్ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే అవకాశం తక్కువే అని అన్నారు. మహిళ నమూనాలు సేకరించి పుణె ల్యాబ్‌కు పంపామని, ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నందున ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని తెలిపారు.