Begin typing your search above and press return to search.
పనిమంతుడు లేకుండానే పనికానిస్తున్న కాంగ్రెస్.. రీజన్ ఇదే!
By: Tupaki Desk | 23 Aug 2022 10:30 AM GMTకాంగ్రెస్ పార్టీని తలుచుకుంటే.. కన్నీళ్లు వస్తున్నాయి.. అని ఇటీవల ఓ మాజీ రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయం.. కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన అనేక మంది చెబుతున్నారు. ఎందుకంటే.. ఒకప్పుడు దేశాన్ని పాలించిన పార్టీకి ఇప్పుడు నడిపించేనేత లేకపోవడమే! ఇదిలావుంటే.. పార్టీని నడిపించాలంటూ.. మరోసారి పార్టీనాయకుడు, ఎంపీ రాహుల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఆయనేమో.. వద్దు మొర్రో అంటున్నారు. అయినా.. కూడా.. మీరే మారు అధ్యక్షులు.. మీరే మాకు.. దిశాననిర్దేశం చేయాలంటూ.. నాయకులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. రాహుల్‌కు బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోందంటే.. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మూడు, నాలుగు రోజుల్లో వెలువడే అ అవకాశం ఉంది. వచ్చే నెల 20 నాటికల్లా నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలిపింది. అయితే.. తుది తేదీలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదించాల్సి ఉందని కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీపరంగా ఏర్పాట్లు పూర్తవుతున్నా దానిని చేపట్టేందుకు అగ్రనేత రాహుల్‌గాంధీ ఈసారి ముందుకు వస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ఓటమి చెందాక పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ 2019లో రాజీనామా చేశారు. నేతల ఒత్తిడితో ఆ బాధ్యతను సోనియాగాంధీ మరోసారి స్వీకరించారు. మధ్యలో సీనియర్ నేతలు అసమ్మతి గళం వినిపించినప్పుడు రాజీనామా చేసేందుకు ఆమె సిద్ధపడినా సీడబ్ల్యూసీ విన్నపం మేరకు కొనసాగుతున్నారు.
పార్టీలో అత్యధికులు రాహుల్‌నే మరోసారి అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని, మునుపటి నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లుగా ఆయన నుంచి ఎలాంటి సంకేతాలు రావట్లేదని సీనియర్ నాయకుడొకరు తెలిపారు. అయినప్పటికీ.. ఆయననే ఏకగ్రీవంగా ఎన్నకుని తీరుతామని.. గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నవారుచెబుతున్నారు. సోనియా పరిస్థితి చూస్తే.. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో సహాయం చేయడానికి కార్యనిర్వాహక అధ్యక్షుల హోదాతో ఒకరిద్దరు సీనియర్ నాయకులకు బాధ్యత అప్పగించాలని వారు సూచిస్తున్నారు.
దేశంలో ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇలాంటి తరుణంలో సోనియా, రాహుల్‌లలో ఎవరో ఒకరు అధ్యక్ష పదవిలో కొనసాగితే వారిని ఇరుకున పెట్టడం అధికార పార్టీకి కష్టమవుతుందని వారు అంటున్నారు. ఏదేమైనా.. తాను మాత్రం అధ్యక్ష పగ్గాలు చేపట్టేది లేదని రాహుల్ అంటున్నారు. కానీ, నాయకులు మాత్రం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పని మంతుడులేకుండానే పనికానిచ్చేస్తున్నట్టుగా.. ఎన్నికలకు మాత్రం షెడ్యూల్ రెడీ చేయడం గమనార్హం.