Begin typing your search above and press return to search.
కోహ్లీ వీరాభిమాని పాక్ లో ఒంటరి
By: Tupaki Desk | 20 Feb 2016 4:44 AM GMTకేవలం రోజుల తేడాతో రెండు ఘటనలు దాయాది దేశాల్లో జరిగాయి. ఇందులో మొదటిది.. పాక్ కు చెందిన ఒక యువకుడు (ఉమర్ దరాజ్) విరాట్ కోహ్లీ వీరాభిమాని. అతను పాక్ లోని పంజాబ్ ప్రాంతంలో ఒకారో జిల్లాలో నివసిస్తుంటాడు. ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ సందర్భంగా కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోవటంతో సంతోషపడిన ఆ అభిమాని భారతీయజెండాను ఇంటిపైన ఎగురవేశాడు. అలా జెండా ఎగురవేయటం నేరమన్న విషయం తనకు తెలీదని సదరు వ్యక్తి వేడుకుంటున్నా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అతనిపై ఏకంగా దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. అతనిపై ఆరోపణలు కానీ రుజువైతే పదేళ్లకు తగ్గకుండా శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ ఘటనకు కాస్త అటూఇటూగా ఢిల్లీలోని జేఎన్ యూ వర్సిటీలో ఉగ్రవాది.. పార్లమెంటు దాడి కేసులో దోషిగా తేలి ఉరిశిక్ష అమలు జరిగిన రాక్షసుడి సంస్మరణ సభను వర్సిటీలో నిర్వహించటం.. ఆ సందర్భంగా పాక్ అనుకూల నినాదాలు చేయటం జరిగింది. దీన్ని తప్పంటూ పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. సంస్మరణ సభను నిర్వహించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.
ఈ విషయాన్ని ఇక్కడ కట్ చేసి.. పాక్ ఘటనలోకి వెళితే.. జెండా ఎగురవేసిన కోహ్లీ వీరాభిమానికి బెయిల్ ఇచ్చేందుకు సైతం అక్కడి కోర్టు నో అంది. ఈ ఘటన మీద పాక్ లో ఎవరూ ఖండించలేదు. అమాయకుడు.. తెలిసీ తెలియన తప్పుచేశాడని అనుకోలేదు. అంతదాకా ఎందుకు.. తన వీరాభిమాని విషయంలో అతడు చేసిన పని పట్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై.. కోహ్లీ స్పందించింది లేదు. చట్టం మీద అవగాహన లేక తాను తప్పు చేశానని.. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని కోహ్లీ వీరాభిమాని వేడుకుంటున్నా అక్కడి చట్టంతో సహా.. పాక్ లోని ఎవరూ అతనికి అండగా నిలవని పరిస్థితి.
ఇక్కడే ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టి.. మళ్లీ.. జేఎన్ యూ వ్యవహారంలోకి తొంగిచూస్తే.. జేఎన్ యూలో ఉగ్రవాది సంస్మరణ సభను నిర్వహించటాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా.. విశ్వవిద్యాలయాల్లో పలు విరుద్ధ అంశాల మీద చర్చ జరగటం.. మేధో ఘర్షణ జరగటం శుభ పరిణామంగా మేధావులతో సహా.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు.. కమ్యూనిస్ట్ అగ్రనేతల వరకూ అందరూ అండగా నిలిచే వారే. అంతేకానీ.. పార్లమెంటు మీద దాడి చేసేందుకు తెగబడిన ఒక దుర్మార్గుడి విషయంలో మద్దుతుగా నిలవటం ఏమిటి? దేశాన్ని అస్థిరపరిచే కుట్ర పన్ని.. ఏకంగా పార్లమెంటు మీద దాడి చేసినోడ్ని కీర్తిస్తూ సంస్మరణ సభ ఏమిటన్నది అడిగింది లేదు. ఈ రోజు అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించినోళ్లు.. దానికి మద్దుతుగా నిలుస్తున్న రాజకీయ నేతలు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ రోజు పార్లమెంటు మీద దాడి జరిగిన సమయంలో మనకెందుకులే అని భద్రతా సిబ్బంది భావించి.. ఉగ్రవాదులతో ఫైటింగ్ చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ తమ బాధ్యతల్ని పక్కన పెట్టి పారిపోయి ఉంటే..?
ప్రాణాలకు తెగించి పోరాడి.. అమరులైన వారి ఆత్మల మాటేమిటి? అఫ్జల్ గురు సంస్మరణ సభకు మద్దుతు పలుకుతున్న వారంతా.. పార్లమెంటు దాడిలో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారి విషయం మీద ఏం మాట్లాడతారు? ఏం బదులిస్తారు?
తెలిసీతెలియని పిల్లతనంతో జాతీయజెండా ఎగురవేసి.. తప్పు అయిపోయింది మొర్రో అంటూ వేడుకుంటున్నా ఒక్కరంటే ఒక్కరు కిమ్మని దేశం ఒకపక్క.. బరి తెగించిన వైనానికి నిలువెత్తు నిదర్శనంగా.. దేశ సార్వభౌమాధికారంపై దాడికి పాల్పడిన దుష్టుడికి విధించిన ఉరిపైనా.. అతడి చావును సంస్మరణ సభలా నిర్వహిస్తున్న కొందరి దర్మార్గాన్ని కొన్ని రాజకీయ పార్టీలు.. కొన్ని వర్గాల ప్రజలున్న దేశం మరో పక్క. రెండు ఘటనలు.. వాటి విషయంలో ఆయా దేశాల్లో చోటు చేసుకున్న యాక్షన్.. రియాక్షన్లు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనలో లేనిది.. పక్కోడిలో ఉన్నదేమిటి? దానికి ఏ పేరు పెడదామన్నది మన మేధావుల్ని అడిగి నిర్ణయం తీసుకోవటమే మంచిదేమో..? ఎందుకంటే వారే కదా దేశానికి భావి మార్గదర్శకులు(?)గా తమను తాము కీర్తించుకుంటారు.