Begin typing your search above and press return to search.

వైవీ సుబ్బారెడ్డికి సపోర్ట్ గా వాళ్లు రారేం?

By:  Tupaki Desk   |   2 Dec 2019 2:30 PM GMT
వైవీ సుబ్బారెడ్డికి సపోర్ట్ గా వాళ్లు రారేం?
X
టీటీడీని - తిరుమలను తమ రాజకీయాల కోసం పుష్కలంగా వినియోగించుకుంటూ ఉంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మత రాజకీయం తప్ప మరో ఆధారం లేకుండా పోయాయి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా తోడవుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ స్టెప్పులకు అనుగుణంగా తందానా అంటున్నాడు పవన్ కల్యాణ్. అటు తెలుగుదేశం - ఇటు పవన్ కల్యాణ్ లు ఒక వ్యూహాత్మకంగానే మతద్వేష రాజకీయాలను మొదలుపెడుతున్నారని - ఏమీ లేని చోట కూడా నిప్పు పుట్టించాలని చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

జగన్ మీద నెగ్గుకు రావాలంటే మతం తప్ప మరో ఆయుధం పనికిరాదని వారు ఫిక్సయినట్టుగా సమాచారం. ఇక మరే రకంగానూ తమకు జగన్ అవకాశం ఇవ్వకపోవడంతోనే వారు అలా మతం విద్వేషాలను రేకెత్తించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారనేది పబ్లిక్ టాక్. అయితే తెలుగునాట మత రాజకీయం ఎంత వరకూ సాగుతుంది? అనేది సందేహమే. అందులోనూ.. ఇప్పటి నుంచినే ప్రతి రోజూ మత రాజకీయం చేస్తే.. జనాలకు కూడా అన్నీ అర్థం అయిపోయే రోజులు ఇవి!

ఆ సంగతలా ఉంటే.. ఆ విద్వేష రాజకీయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా బదులు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకు ఉదాహరణ టీటీడీ వ్యవహారమే. తెలుగుదేశం పార్టీ వాళ్లు వ్యూహాత్మకంగా మత విద్వేషాలను రేకెత్తించేలా ఈ రచ్చను చేశారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి - ఈవో సింఘాల్ తదితరులు స్పందించారు. వారు ఘాటుగా స్పందించారు. తిరుమలను రాజకీయాలకు వాడొద్దని హెచ్చరించారు.

అంత వరకూ బాగానే ఉంది కానీ - ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించాల్సింది. తిరుమలను అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వం పై మత బురదను జల్లడానికి ప్రయత్నిస్తూ ఉండటాన్ని ఆక్షేపించాల్సింది. ఈ బాధ్యత వైసీపీ వాళ్ల మీదే ఉంది. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఈ విషయంలో స్పందించాల్సింది. కానీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు వారు గళం విప్పలేదు. కనీసం ఇప్పుడైనా వారు ఇలాంటి విషయాల మీద స్పందిస్తారేమో చూడాల్సి ఉంది!