Begin typing your search above and press return to search.
రైతులకు మద్దతు ధర అందని ద్రాక్షే
By: Tupaki Desk | 31 May 2021 3:55 AM GMTఆరుగాలం సాగుచేసిన ధాన్యం అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర కరువు అవుతోంది. రబీలో పండించిన ధాన్యంను తక్కువ ధరకు అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.
75 కిలోల బస్తాకు మద్దతు ధరగా కేంద్రం రూ.1416 ప్రకటించింది. కానీ ఏపీలో మాత్రం రైతులకు రూ.850 నుంచి రూ.1100లోపే దక్కుతోంది. ఇక రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకొని.. కళ్లంలోనే ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మిల్లర్లు చెప్పిందే ధర అవుతోంది.
ఆర్.బీకేలు, సేకరణ కేంద్రాల ద్వారా నేరుగా సేకరించినా చివరకు మిల్లరు వద్దకు వెళ్లేసరికి ఏదో ఒక సాకుతో ధర తగ్గిస్తున్నారు. విరుగుడు వస్తోందని.. నూక ఎక్కువగా ఉందని ఒక్కో బస్తాకు 8 నుంచి 25 కిలోల వరకు తూకం తగ్గిస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.దీనివల్ల సగటున రూ.200 నుంచి రూ.500 పైగా కోత పెడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలు చోట్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది.
రైతులు మద్దతు ధరకు అమ్ముకున్నట్లే రికార్డుల్లో కనిపిస్తున్నా.. లాభం మాత్రం మిల్లర్లకే దక్కుతోందని ఆరోపిస్తున్నారు. 100 బస్తాల ధాన్యం పండించి మిల్లుకు పంపితే.. మద్దతు ధర ప్రకారం 75 బస్తాలకే లెక్క కట్టి సొమ్ము ఇస్తున్నారు. సగటున 25 శాతం వరకు తూకం తగ్గిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదని కృష్ణా జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.