Begin typing your search above and press return to search.

వెనక్కి తగ్గేదే లేదంటున్న అమిత్ షా!

By:  Tupaki Desk   |   26 Dec 2019 6:46 AM GMT
వెనక్కి తగ్గేదే లేదంటున్న అమిత్ షా!
X
గత కొద్దీ రోజులుగా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసన తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేసేది లేదు అని బహిరంగంగా ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ..జాతీయ జనాభా నమోదు - జాతీయ పౌర నమోదు (ఎన్ ఆర్ సి)లపై భవిష్యత్తులో ఎలాంటి చర్చలు - సమావేశాలు ఉండవు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.

ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన తుది నిర్ణయలాంటిదేనని - ఎన్పీఆర్ - ఎన్ ఆర్ సి ల మధ్య పొంతనే లేదని - ఈ రెండూ వేర్వేరుగా చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ రెండింట్లో ఉన్న తేడాలను ప్రతిపక్ష పార్టీలు తెలుసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, ఎన్పీఆర్ పేరుతో ప్రభుత్వం సేకరించే వ్యక్తిగత వివరాలు - ఇతర డేటాను ఎన్ ఆర్సీకి బదలాయించే ప్రమాదం లేకపోలేదంటూ కాంగ్రెస్ సహా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు - బీజేపీయేతర పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఏఐఎంఐఎం అధినేత - హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాల అనుమానాలపై స్పందించిన అమిత్ షా...కేరళ - పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఎన్పీఆర్ ను అమలు చేయడానికి అంగీకరించాలని సూచించారు. ఎన్పీఆర్ - ఎన్ ఆర్ సి కార్యక్రమాలు రెండూ ఒకటే అనే అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయని, వారిని గందరగోళంలో నెట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్పీఆర్ ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి 3,941 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నామని - ఎన్పీఆర్ కోసం సేకరించిన వివరాలు - ఇతర డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ ఆర్ సి లో పొందు పర్చబోమని హామీ ఇచ్చారు.ఈ రెండింటి మధ్య గల తేడాను వివరించడానికి దేశవ్యాప్తంగా చర్చలు - సమావేశాలను నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని చర్చలకు వెనుకాడటం అంటే తాము పొరపాటు చేసినట్టుగా భావించ వద్దని అమిత్ షా చెప్పారు. అలాగే త్వరలోనే ప్రజలలో ఉన్న సందేహాలను కేంద్రం తొలగించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పారు.