Begin typing your search above and press return to search.

ప్చ్.. న్యూ ఇయర్ పార్టీల్లో నో తెలుగు పాటలు

By:  Tupaki Desk   |   29 Dec 2016 5:34 PM GMT
ప్చ్.. న్యూ ఇయర్ పార్టీల్లో నో తెలుగు పాటలు
X
న్యూ ఇయర్ పార్టీలంటేనే రచ్చ రచ్చగా ఉంటాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
అందరూ ఆడిపాడుతుంటారు. న్యూ ఇయర్ పార్టీల్లో పాటలను ప్రసారం చేయడం.. వాటికి డ్యాన్సులు వేయడం సాధారణం. ఈ సారి మాత్రం ఎక్కడా తెలుగు పాటలు వినిపించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇందుకు కారణం కాపీరైట్ హక్కులేనట. సినిమా పాటలను ప్రజా సమూహంలో వినిపించేందుకు ప్రత్యేక హక్కులు తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగులో 90 శాతం సినిమాలకు ఫోనోగ్రఫిక్ పెర్ఫామెన్స్ లిమిటెడ్ అనే కంపెనీ దగ్గరే ఈ రైట్స్ ఉన్నాయి. వీరి దగ్గర నుంచి లైసెన్స్ అగ్రిమెంట్ లేకుండా ఆయా పాటలను వినిపించే అవకాశం ఉండదు. యూఎస్ఎ లాంటి దేశాల్లో వీటిని స్ట్రిక్ట్ గానే ఫాలో అవుతుంటారు కానీ.. సాధారణంగా ఇలాంటి వాటిని ఇండియాలో లైట్ తీసుకుంటూ ఉంటారు.

పీపీఎల్ మాత్రం ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటికే ఫైవ్ స్టార్ హోటల్స్ కు.. బడా హోటల్స్ కు.. ఈవెంట్ నిర్వాహణ ప్రాంతాలకు.. తెలుగు మ్యూజిక్ ప్రసారం చేసే విషయంలో నోటీసులతో పాటు ఇంజక్షన్ ఆర్డర్స్ ను కూడా అందించిందట. వీటిని మీరితే కోర్టు ధిక్కారంతో పాటు పెనాల్టీలు కూడా కట్టాల్సి వచ్చే అవకాశం ఉండడంతో.. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీల్లో తెలుగు పాటలు వినిపించకపోవచ్చని అంటున్నారు.