Begin typing your search above and press return to search.

కరెన్సీ నోట్లు చిరిగిపోతే నో టెంక్షన్ ... ఇలా మార్చుకోండి !

By:  Tupaki Desk   |   2 March 2021 11:30 PM GMT
కరెన్సీ నోట్లు చిరిగిపోతే నో టెంక్షన్ ... ఇలా మార్చుకోండి !
X
చిరిగిపోయిన, నలిగిపోయిన, పాతబడిన కరెన్సీ నోట్లను మనం తరచూగా చూస్తూనే ఉంటాం. ఈ నోట్లు మన వద్ద ఉంటే ఎలా మార్చుకోవాలా అని తెగ ఆలోచిస్తుంటాం. దుకాణాల్లో, పెట్రోల్‌ బంకుల్లో ఇచ్చినా , ప్రయాణాల్లో వాడినా ఫలితం లేక రోజుల తరబడి జేబుల్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ఖరాబైన నోట్లను మీ సమీపంలోని ఏ బ్యాంక్‌కైనా వెళ్లి సులువుగానే మార్చుకోవచ్చని, బదులుగా కొత్త నోట్లను తెచ్చుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెప్తుంది.

ఇది ఇలా ఉండగా పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్‌ తప్పనిసరిగా తీసుకోవాలని… తమ ఖాతాదారుల కాదా అన్నది కూడా చూడవద్దని పైగా ఎటువంటి చార్జెస్ కూడా తీసుకోవద్దు అని ఆర్బీఐ అంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా లో ఇటీవల రూ.5 లక్షల విలువైన నోట్లు చెదలు పట్టిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకే ఇక కరెన్సీని కూడా ప్రత్యేక ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చని సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇది ఇలా ఉంటే నోట్లపై నెంబర్‌ మాత్రం తప్పక కనిపించాల్సి ఉంటుంది అని చెప్పింది. కాబట్టి ఇక పై పాడైపోయిన నోట్లను సులువుగా బ్యాంక్ కి వెళ్లి మార్చేయ వచ్చు. నిజానికి పాడైపోయిన నోట్లను కమీషన్‌ తీసుకుని బదులుగా ఇతర నోట్లను ఇచ్చే వ్యాపారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ దందా ఆర్బీఐ కార్యాలయాల సమీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా ఈ పాడైన నోట్లను బ్యాంకుల్లో, ఆర్బీఐ ఆఫీసుల్లోనే మార్చేస్తారని బ్యాంకింగ్‌ వర్గాలు చెప్తున్నాయి.