Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీకి తిరుగుబాటు ముప్పు లేనట్టే!

By:  Tupaki Desk   |   9 Sep 2019 4:45 AM GMT
గులాబీ పార్టీకి తిరుగుబాటు ముప్పు లేనట్టే!
X
అటు ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగించలేదు. ఇటు హరీష్ రావుకు మంత్రి పదవి దక్కేసింది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి తిరుగుబాటు ముప్పు తప్పినట్టే అనే టాక్ వినిపిస్తూ ఉందిప్పుడు. కేసీఆర్ కేబీనెట్ పునర్వ్యస్థీకరణ అంశం ఏ రేంజ్ లో చర్చగా నిలిచిందో అందరికీ తెలిసిన సంగతే. కొన్ని రోజుల నుంచి గట్టి ప్రచారం ఒకటి సాగింది.

అదే ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనేది. కేబినెట్ మీటింగులకు సంబంధించి ఆయన లీకులు ఇచ్చారనే రచ్చ మీడియాలో సాగింది. దీంతో ఆయనను కేబిట్ నుంచి తప్పిస్తారని గుసగుసలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగా గులాబీ జెండా ఓనర్ షిప్ పై ఈటల వ్యాఖ్యలు - దానికి ప్రతిగా కేసీఆర్ భక్తుల కౌంటర్లు.. వంటివి జరిగాయి. ఒక ప్రాంతీయ పార్టీలో అలాంటివి పెద్ద వివాదాలే!

ఇలాంటి నేపథ్యంలో ఈటల పదవి పోవడం ఖాయమని - ఆ వెంటనే ఆయనను బీజేపీ దగ్గరకు తీసుకుంటుందంటూ ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే పునర్వ్యస్థీకరణలో ఈటల పదవి నిలిచింది. దీంతో ఆయన కూడా ఇక ఉద్రేకపడే అవకాశాలు ఉండవని పరిశీలకులు అంటున్నారు.

ఇక హరీష్ రావుకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఇన్నాళ్లూ జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. అటు హరీష్ కు కాంగ్రెస్ వల వేస్తోందనే ఊహాగానాలు - ఇటు బీజేపీ కూడా ఆయనను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోందనే విశ్లేషణలు వినిపించాయి. అయితే వాటన్నింటికీ తెరదించుతూ హరీష్ కు కేబినెట్లో చోటు కల్పించి కీలకమైన శాఖను ఆయనకు అప్పగించారు కేసీఆర్.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో తిరుగుబాలు అనే చర్చకు కొన్నాళ్ల పాటు ఫుల్ స్టాప్ పెట్టారు కేసీఆర్.