Begin typing your search above and press return to search.
అలీ ఆశలు ఆవిరయ్యే..
By: Tupaki Desk | 17 March 2019 11:12 AM GMTకమెడియన్ రాజకీయ నాయకుడు అవుదామనుకున్నాడు. తనకు ఎంతో ఇచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అవకాశాలు లేకపోయేసరికి రాజకీయాల వైపు అడుగులు వేశాడు. తన ఆప్త మిత్రుడు జనసేనాని పవన్ పార్టీని సైతం కాలదన్ని వైసీపీలో చేరారు. టికెట్ ఖాయమనుకున్నాడు.కానీ జగన్ ఎన్నికల వేళ వలసవచ్చిన ఆ కమెడియన్ కు టికెట్ ఇవ్వలేదు.. దీంతో ఆశలు ఆవిరై ఇప్పుడు అలీ ఒంటరిగా మిగిలిపోయాడు..
వైసీపీ అధినేత జగన్ ఎంత మంది వచ్చినా వారందరికీ కండువా అయితే కప్పాడు కానీ సీట్లు మాత్రం ఇవ్వలేదు. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమైంది. జగన్ టికెట్ ఇస్తాడని చాలా మంది టీడీపీ నేతలు, ఇతర రంగాల ప్రముఖులు వైసీపీలో ఆగమేఘాల మీద చేరారు. కానీ ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన జగన్ ఉన్న ఫళంగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వలేదు. బలం, బలగం.. స్థానికులకే టికెట్లు కేటాయించారు.
ఇలానే ఆశలు పెంచుకొని తొలిసారి రాజకీయాల్లోకి అడుగులు వేశారు అలీ. అందరు అధినేతలను కలిశారు. బాబు నో చెప్పాడు.. జగన్ ను కలిశాడు.. స్పందన వచ్చింది. కానీ ఇప్పుడు ప్రకటించిన జాబితాలో సీటు రాలేదు. తనకు సినిమాల్లో ఆప్తమిత్రుడైన పవన్ కళ్యాన్ పార్టీని కాదని వైసీపీలో చేరిన అలీ ఆశలు నెరవేరలేదు. జగన్ తాను అనుకున్న వారికే సీట్లు ఇచ్చారు. దీంతో అలీ రాజకీయ అరంగేట్రానికి బ్రేకులు పడ్డాయి.